బిగ్‌బాస్-4లో మరో వైల్డ్ కార్డ్.. మరో హీరోయిన్‌తో కొత్త గ్లామర్

బిగ్‌బాస్-4లో మరో వైల్డ్ కార్డ్.. మరో హీరోయిన్‌తో కొత్త గ్లామర్

కింగ్ నాగార్జున చెబుతున్న వివరాలను బట్టి టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న బిగ్‌బాస్ షోలో మరో కీలకమార్పు జరగనుంది. మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి బిగ్ బాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఓ వైపు ఐపీఎల్ జరుగుతున్నా క్రేజ్ తగ్గించుకోకుండా దూసుకుపోతున్న బిగ్‌బాస్ కు ప్రేక్ష‌కులు కళ్లప్పగించేస్తున్నారు. ఐపీఎల్ మాత్ర‌మే చూస్తున్న వారిని అటుంచితే.. బిగ్‌బాస్ లేదా రెండింటిని క‌వ‌ర్ చేస్తున్నవారు మూడో ర‌కం.

ఐపీఎల్ మొదలుకానన్ని రోజులు సోలోగా దూసుకుపోయిన బిగ్ బాస్.. ఐపీఎల్ వచ్చేసరికి అభిమానుల్లో షేరింగ్ కు బలైపోయింది. మొద‌టి ఎపిసోడ్‌తో టీఆర్పీ రికార్డులు బ‌ద్ధ‌లు కొట్టిన బిగ్‌బాస్ అదే రేంజ్ లో కొనసాగాలని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా రెండు వారాల్లోనే రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలుఇచ్చేసింది. ఇక ఐపీఎల్ క్రేజ్ ను చేరుకోవాలని.. ముచ్చ‌ట‌గా మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి రెడీ అయిపోయింది. ముందుగా అనుకున్నట్లుగా జంప్ జిలానీ సినిమా హీరోయిన్‌ స్వాతి దీక్షిత్ ను బిగ్ బాస్-4వ సీజన్ లోకి వెల్కమ్ చెప్పనున్నారు.

చిచ్చుపెట్టడం, చెదరగొట్టడం బిగ్ బాస్ కు మామూలే కాబట్టి.. షోలోకి హీరోయిన్ ను రప్పించి వేడెక్కించడంతో పాటు హౌజ్ కు మరింత గ్లామర్ జోడించనున్నారు. ఇప్ప‌టికే కుమార్ సాయి, అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు.