ఎన్నికల బరిలోకా ? ప్రచారానికా ? : బాబుతో కౌశల్

  • Publish Date - March 9, 2019 / 10:03 AM IST

బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ విజయవాడ అమరావతిలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ సీఎం చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మార్చి 08వ తేదీ శుక్రవారం రాత్రి ఈ సమావేశం జరిగింది. కౌశల్‌ని మంత్రి గంటా శ్రీనివాసరావు తీసుకొచ్చారు. సమావేశంలో ఏం చర్చించారనేది తెలియరాలేదు. టీడీపీలో కౌశల్ చేరుతారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా బాబును కలవడంతో కౌశల్ పార్టీలో చేరడం పక్కా అని తేలిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 
Read Also : హేమాహేమీలు : ఆంధ్ర ఎన్నికల స్థాయిలో.. మా ఎలక్షన్స్

బిగ్ బాస్ 2 విన్నర్ అయిన అనంతరం కౌశల్‌కి బిగ్ పాలోయింగ్ వచ్చింది. విజేతగా వచ్చిన డబ్బును క్యాన్సర్ బాధితులకు ఖర్చు చేస్తానని కౌశల్ ప్రకటించి ఉదారత వ్యక్తపరిచారు. ఏకంగా కౌశల్ ఆర్మీ అంటూ ఏర్పడడం..సేవా కార్యక్రమాలు చేయడం జరిగిపోయాయి. బిగ్ బాస్ విన్నర్ కావడానికి కౌశల్ ఆర్మీ కీలక పాత్ర ఉంది. ఇదంతా గతం..తాజాగా కౌశల్‌పై పలు ఆరోపణలు వస్తున్నాయి. కౌశల్ మంచి వ్యక్తి కాదంటూ ఆర్మీ గ్రూపుకు సంబంధించిన వారు ఆరోపణలు చేయడం కలకలం సృష్టించాయి.

దీనిపై కౌశల్ స్పందించాల్సి వచ్చింది. సినీ నటుడు పవన్ కళ్యాణ్ అంటే తనకు స్పూర్తి అని ఎన్నోమార్లు కౌశల్ చెప్పడంతో ఆయన స్థాపించిన జనసేనలోకి వెళుతారని అప్పట్లో ప్రచారం జరిగింది. చివరకు బాబుతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. కౌశల్‌కు యూత్‌లో ఉన్న ఇమేజ్‌ని క్యాష్ చేసుకోవాలని గంటా భావిస్తున్నట్లు టాక్. ఇక్కడ కౌశల్ ఎన్నికల బరిలోకి దిగుతారా ? లేక గంటాకు సపోర్టు ఇస్తారా ? అనేది రానున్న రోజుల్లో తేలుతుంది. 
Read Also : ‘మా’ ఎన్నికలు: రెండు ప్యానల్‌ల సభ్యులు వీళ్లే!

ట్రెండింగ్ వార్తలు