ఓటింగ్‌లో ముందున్నది ఎవరు? : బిగ్ బాస్ టైటిల్ ఎవరిది? 

  • Published By: vamsi ,Published On : November 1, 2019 / 02:03 PM IST
ఓటింగ్‌లో ముందున్నది ఎవరు? : బిగ్ బాస్ టైటిల్ ఎవరిది? 

ఆఖరి ఘట్టాలకు వచ్చేసింది బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 వంద రోజులు పాటు సాగిన ఎట్టకేలకు ముగిసేందుకు సిద్ధం అయ్యింది. ఇంక ఒక్కరోజే మిగిలుంది. మునుపటి రెండు సీజన్ల కంటే ఈ సీజన్ కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గింది. అయితే ఎట్టకేలకు చివరకు వచ్చేసింది. ఇంక ఒక్కరోజు మాత్రమే.. ఫైనల్‌లో ఐదుగురు ఉన్నా కూడా పోటీ మాత్రం ఇద్దరి మధ్య మాత్రమే ఉన్నాయని అభీజ్ఞ వర్గాల బోగట్టా.

ఎన్నో వ్యయప్రయాసలకు సాహసించి బిగ్ బాస్ షో నిర్వాహకులు ఘనంగానే ప్లాన్ చేసిన షో చివరకు మాత్రం కాస్త నీరసంగానే ముగుస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవిని ఫైనల్ షో కి తీసుకొస్తున్నారని ప్రచారం. గత సీజన్లో వెంకటేష్ ఫైనల్ విజేతను ప్రకటించేందుకు రాగా ఇప్పుడు చిరంజీవి వస్తున్నారు. 

రెండవ సీజన్‌లో మాత్రం అసలు పోటీ అనేది లేకుండా కౌశల్ బిగ్ బాస్ విన్నర్ అనేది ముందే తెలిసిపోయింది. అయితే ఈసారి మాత్రం అలా లేదు. లాస్ట్‌కి వచ్చేసరికి బిగ్ బాస్‌లో అనుకోని విధంగా అనూహ్యంగా ఫస్ట్ నుంచి పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయని ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ ఏర్పడింది. వాళ్లలో ఒక్కరు రాహుల్ అయితే మరొకరు శ్రీముఖి. గత సీజన్‌లో ఉన్న ఆర్మీల హడావుడి ఇప్పుడు లేనప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ప్రమోషన్ టీమ్స్ గట్టిగా కష్టపడుతున్నాయి. 

ఇప్పుడు అసలు చర్చ ఏమిటంటే..? ఎవరు విజేత..? ఎవరికి తగ్గట్టుగా వాళ్లు ప్లాన్ చేసేసుకున్నారు. అభిమానుల పేరుతో ఈ సోషల్ మీడియా ప్రమోటర్లే పోస్టింగ్‌లు దంచి కొడుతున్నారు. కొందరు తెలంగాణ సెంటిమెంటూ.. మరికొందరు మతం.. ఇంకొందరు కులం గట్టిగానే ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియాలో పోస్టులు నడుస్తూనే ఉన్నయ్..

ఇదిలా ఉంటే రకరకాల అనధికారిక సైట్లలో ఓటింగులు నడుపుతూ ఉన్నాయి. అందులో రాహుల్ చాలా ముందంజలో ఉన్నాడు.. సెకండ్ శ్రీముఖి కనిపిస్తుంది. బయట కూడా ఇదే హడావుడి అయితే ఫస్ట్ నుంచి వినిపిస్తుంది. అయితే శ్రీముఖీనే విన్నర్ అని అందుకే ఆమె గురించి చివరి వారంలో బాగా పాజిటివ్ చూపించారు అని అంటున్నారు. ఇక మూడవ ప్లేసులో వరుణ్. నాల్గవ ప్లేసులో బాబా భాస్కర్, ఆఖరి ప్లేస్‌లో వరుణ్ ఉన్నారట.

మొదట్లో రాహుల్ పెద్దగా ఎంటర్‌టైన్ చేయని కంటెస్టెంటు.. యాక్టివిటీల్లో కూడా బద్దకమే. కానీ పునర్నవితో బంధం విషయంలో కాస్త పాపులారిటీ దక్కింది. అంతేనా? ప్రతి విషయంలో నిజాయితీగా కనిపించాడు. తెలంగాణ, పాత బస్తీ, బార్బర్, తన నేటివిటీని, ఒరిజినాలిటీని ఎక్కడా దాచుకోకుండా సెంటిమెంట్ క్రియేట్ చేసుకున్నాడు. అందుకే చివరకు రాహుల్‌కే విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది అంచనా. ఏది ఏమైనా శనివారం రాత్రికి అసలు విషయం తెలుస్తుంది. చూడాలి మరి.