Bigg Boss 4: హౌస్‌లో అనుష్క సందడి!

  • Published By: sekhar ,Published On : September 27, 2020 / 11:57 AM IST
Bigg Boss 4: హౌస్‌లో అనుష్క సందడి!

Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్ ప్రేక్షకులకు ఈ ఆదివారం ఎంటర్‌టైన్‌మెంట్ డబుల్ కానుందనే వార్త వినిపిస్తోంది. ఎందుకంటే ఈ షోలో స్వీటీ అనుష్క సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఇవాళ్టి(సెప్టెంబర్ 27) ఎపిసోడ్‌లోనే అని సమాచారం.


అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ అక్టోబర్ 2న ఓటీటీలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. పరిస్థితులు బావుంటే ఈ పాటికి ఈ మూవీ ప్రమోషన్లు బాగా జరిగేవి. సినిమా విడుదల కూడా అయిపోయి ఉండేది. కానీ కరోనాతో పరిస్థితులు మారగా.. ప్రమోషన్లు కూడా ఆన్‌లైన్‌లోనే కానిచ్చేస్తున్నారు.
https://10tv.in/devi-nagavalli-going-to-eliminate-on-this-week/

దాంతో సినిమా జనాల్లోకి అంతగా రీచ్ కావడం లేదు. దీంతో ప్రస్తుతం
బుల్లితెరపై బిగ్‌బాస్ హవా కొనసాగుతుండటంతో ‘నిశ్శబ్దం’ టీమ్‌ తమ సినిమా ప్రమోషన్ కోసం బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. బుల్లితెరపై బిగ్‌బాస్ జోరు కొనసాగుతుండటం, దీని ద్వారా తమ సినిమా ఎక్కువ మందికి చేరే అవకాశం ఉండటంతో ‘నిశ్శబ్దం’ యూనిట్‌ ఈ ప్లాన్ చేసినట్లు సమాచారం.

ఈ సందర్భంగా అనుష్క టీమ్‌ హౌస్‌లోకి వెళ్లి కంటెస్టెంట్‌లతో సందడి చేయనున్నట్లు సమాచారం. అయితే గతంలోనూ బిగ్‌బాస్‌లో ప్రమోషన్లు జరిగాయి. ఇక ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఈ సీజన్‌లో బయటి వారిని లోపలికి అనుమతించడం లేదు. వైల్డ్‌ కార్డు ఎంట్రీ ద్వారా వెళ్లే వారిని సైతం క్వారంటైన్‌లో పెట్టి పరీక్షలు చేసి పంపిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ‘నిశ్శబ్దం’ టీమ్‌ హౌస్ లోనికి వెళ్తుందా..? లేక నాగార్జునతో స్టేజ్‌పైనే సందడి చేయనుందా..? అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.