Bigg Boss 4 : హారికను సేఫ్ చేసిన కమల్

  • Published By: madhu ,Published On : November 8, 2020 / 01:32 PM IST
Bigg Boss 4 : హారికను సేఫ్ చేసిన కమల్

Bigg Boss 4: Kamal saves Harika : బుల్లితెరపై బిగ్ బాస్ 4 సందడి కొనసొగుతూనే ఉంది. 2020, నవంబర్ 07వ తేదీ శనివారం ప్రసారమైన ఎపిసోడ్ లో బిగ్ బాస్ 4 తమిళ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న కమల్ హాసన్ తళుక్కుమన్నారు. వర్చువల్ రియాల్టీ ద్వారా నాగ్ తో పాటు తెలుగు కంటెస్ట్‌లతో మాట్లాడారుర. తమిళ, తెలుగు ప్రేక్షకులను కమల్ అలరించారు. తెలుగు, తమిళ బిగ్ బాస్ సభ్యులను ఒకరినొకరిని పరిచయం చేశారు.



హారిక సేఫ్ :-
చివరగా కమల్ తెలుగు బిగ్ బాస్ కి వీడ్కోలు చెప్పే ముందు ఎలిమినేషన్ లో ఉన్న వారి పేర్లను కమల్ కు వినిపించారు. ఇందులో ఒకరిని సేఫ్ చేయాలని చెప్పారు. అప్పటికే ఓ కార్డుపై రాసి ఉన్న పేరును కమల్ కి చూపించారు. చివరకు హారిక అంటూ కమల్ ప్రకటించారు. దీంతో..దేత్తడి హారిక సంతోషం వ్యక్తం చేసింది.



వెలిగిపోయే దీపం, ఆరిపోయే దీపం :-
ఇదిలా ఉంటే..ఈ ఎపిసోడ్ లో ఇంటి సభ్యులకు క్లాస్ పీకారు. ఇంటి సభ్యుల ఒకరిపై ఒకరు అభిప్రాయాలు తెలియచేసుకున్నారు. అభిజిత్, అఖిల్, అమ్మా రాజశేఖర్ మరికొందరు అరియానాపై ఫిర్యాదు చేసి తగిన కారణాలు చెప్పారు. దీపావళి పండుగ సందర్భంగా ఇంటిలో వెలిగిపోయే దీపం ఎవరు ? ఆరిపోయే దీపం ఎవరు ? అనే రెండు పాయింట్ల మీద ఇద్దరి గురించి చెప్పాలనే గేమ్ ఆడించారు. ఈ గేమ్‌లో ఎక్కువ మంది అరియానాను, అమ్మా రాజశేఖర్‌ను ఆరిపోయే దీపంగా అభివర్ణించారు. అందుకు తగిన కారణాలను కూడా చెప్పారు. వెలిగిపోయే దీపం అందరికి సమానంగా ఓట్లు లభించాయి.



ఇమ్యునిటీ టాస్క్ :-
ఇమ్యునిటీ లభించే ఓ టాస్క్ ను నాగార్జున ప్రారంభించారు. గత వారం నామినేట్ అయిన మోనాల్, అవినాష్ కు ఇమ్యునిటీ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇంటి సభ్యులు తమ వస్తువులను దానం చేయాల్సి ఉంటుందని నాగ్ చెప్పారు. రెండు బుట్టలో ఈ వస్తువులు వేశారు. ఏ బుట్టలో బరువు ఉంటుందో వారికి ఇమ్యునిటీ లభిస్తుందన్నమాట. మోనాల్ కు కేవలం అఖిల్ మాత్రమే సపోర్టు చేయగా..అవినాష్ కు సోహైల్, మెహబూబ్, అరియానా, లాస్య మద్దతు పలికారు. చివరకు మోనాల్ బాక్స్ 13 కిలోలు, అవినాష్ కు 23 కిలోలు బరువు తూగాయి. అవినాష్ కు ఇమ్యునిటీ లభించింది.