Bigg Boss 5 : బిగ్ బాస్‌ను బ్యాన్ చేయాలి.. బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్.. అమిత్ షాకు లేఖ

ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో ఆంధ్రా, తెలంగాణ ఫీలింగ్స్ తెచ్చి రెచ్చగొడుతున్నారని రాజా సింగ్ ఆరోపించారు. గత రాత్రి అన్నపూర్ణ స్టూడియో దగ్గర కొందరు రచ్చ చేశారని.. అసలు బిగ్ బాస్ హౌస్

Bigg Boss 5 : బిగ్ బాస్‌ను బ్యాన్ చేయాలి.. బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్.. అమిత్ షాకు లేఖ

Bigg Boss 5

Bigg Boss 5 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రియాల్టీ షో నుంచి అనూహ్యంగా యాంకర్ రవి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. రవి ఎలిమినేట్ అవడం అతడి అభిమానులను విస్మయానికి గురి చేసింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లతో పోల్చితే యాంకర్ రవికి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే, నిన్నటి ఎపిసోడ్ లో రవి ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. ఇది అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఈ వారం కంటెస్టెంట్లలో ఎవరికెన్ని ఓట్లు వచ్చాయో బయటపెట్టాలని బిగ్ బాస్ నిర్వాహకులను డిమాండ్ చేశారు. మరొకరిని సేవ్ చేసేందుకు రవిని బలి చేస్తారా? అంటూ మండిపడుతున్నారు.

Ghee : గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గటానికి నెయ్యి వాడకం మంచిది కాదా?

ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా స్పందించారు. బిగ్ బాస్ పై ఆయన హాట్ కామెంట్స్ చేశారు. రవి ఎలిమినేషన్ పై తమకు అనుమానాలు కలుగుతున్నాయని, దీని వెనుక ఏదైనా కుట్ర జరిగి ఉంటుందని భావిస్తున్నామని అన్నారు. తెలంగాణకు చెందిన వ్యక్తిని బయటికి పంపేయడం ద్వారా వివాదం సృష్టించాలనుకుంటున్నారా? అని రాజా సింగ్ బిగ్ బాస్ నిర్వాహకులను ప్రశ్నించారు. బిగ్ బాస్‌ షోను అన్ని భాషల్లోనూ బ్యాన్ చేయాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తానని రాజాసింగ్ చెప్పారు. అసలు, బిగ్ బాస్ షోలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదన్నారు.

Bigg Boss 5 : ప్రైజ్‌మనీ కంటే ఎక్కువే సంపాదించిన రవి.. అందుకే బిగ్ బాస్ నుంచి అవుట్ అయ్యాడా??

ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో ఆంధ్రా, తెలంగాణ ఫీలింగ్స్ తెచ్చి రెచ్చగొడుతున్నారని రాజా సింగ్ ఆరోపించారు. గత రాత్రి అన్నపూర్ణ స్టూడియో దగ్గర కొందరు రచ్చ చేశారని.. అసలు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ప్రజలకు ఏం మేసెజ్‌లు ఇస్తున్నారని ప్రశ్నించారు. చిన్న పిల్లలు, మహిళలు బిగ్ బాస్ కంటెంట్ చూడలేకపోతున్నారని రాజా సింగ్ వాపోయారు. బిగ్ బాస్ షోకి సైతం సెన్సార్ ఉండాల్సిందేనన్నారు. హిందూ దేవుళ్లను సైతం బిగ్ బాస్‌లో కించపరుస్తున్నారని ఆరోపించారు.

Eyes Carry Bags : కళ్ల కింద క్యారీ బ్యాగులా?…ఏం చేయాలంటే…

కాగా, రియాల్టీ గేమ్ షో బిగ్‌ బాస్‌పై విమర్శలు ఎక్కువవుతున్నాయి. బిగ్‌ బాస్‌ షోను వ్యతిరేకిస్తున్న రాజకీయ నాయకులు పెరిగిపోతున్నారు. ఈ షోను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ గేమ్ షోతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సీపీఐ నేత నారాయణ బిగ్‌ బాస్‌ గేమ్ షోను తీవ్రంగా వ్యతిరేకించారు.