Bigg Boss 5 : కెప్టెన్సీ కోసం బంగారం ఏరుతున్న కంటెస్టెంట్స్

బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్స్ అయిపోవడంతో కెప్టెన్సీ టాస్కులు మొదలు పెట్టారు. గత రెండు వారాల నుంచి చిత్ర విచిత్రమైన కెప్టెన్సీ టాస్కులు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఒకేసారి

Bigg Boss 5 : కెప్టెన్సీ కోసం బంగారం ఏరుతున్న కంటెస్టెంట్స్

Bb Task

Bigg Boss 5 :  బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్స్ అయిపోవడంతో కెప్టెన్సీ టాస్కులు మొదలు పెట్టారు. గత రెండు వారాల నుంచి చిత్ర విచిత్రమైన కెప్టెన్సీ టాస్కులు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఒకేసారి అయిపోకుండా ఈ టాస్కులని సాగదీస్తున్నాడు. తాజాగా ఇవాళ్టి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో ఈ వారం కూడా ఓ కొత్త రకమైన కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ‘నీ ఇల్లు బంగారం కాను’ అనే టాస్క్ ఇచ్చాడు.

Liger : మైక్ టైసన్‌తో రౌడీ స్టార్.. అమెరికాలో మొదలైన రచ్చ

ఈ టాస్కులో ఒక టబ్ లో మట్టి, థర్మాకోల్ బాల్స్ తో పాటు గోల్డ్ కలర్ లో ఉండే చిన్న చిన్న డిజైన్ బాల్స్ కూడా ఉంచారు. కంటెస్టెంట్స్ తలపై మైనింగ్ కి వెళ్లినట్టు కాప్స్ పెట్టుకొని ఆ టబ్ లోకి దిగి ఆ గోల్డెన్ కలర్ బాల్స్ ని ఏరాలి. ఐతే ప్రోమోలో రూల్స్ ఏమి చూపించలేదు. ఒక్కో కంటెస్టెంట్ కో ఒక్కో గ్లాస్ లాకర్ ఇచ్చారు. ఏరిన వాళ్ళు వాళ్ళ బాల్స్ ని ఆ గ్లాస్ లాకర్ లో వేసి కాపాడుకోవాలి.

Movies : ఈ వారం థియేటర్లో/ఓటిటిలో వచ్చే సినిమాలు ఇవే..

ముందు సన్నీ, రవి, షన్ను, సిరిలు కాప్స్ ని అందుకొని బాల్స్ ఏరుకున్నారు. ఇక ఆ బాల్స్ ని కాపాడుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. యాని మాస్టర్, ప్రియాంక, షన్ను వేరే వాళ్ళ బాల్స్ ని దొంగతనం చేయడానికి ట్రై చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు వాళ్ళ బాల్స్ ని కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నారు. మరి ఎవరు బాల్స్ ని దొంగలించారు, ఎవరు ఎక్కువ బాల్స్ ని ఏరారు తెలియాలి అంటే ఇవాళ్టి ఎపిసోడ్ చూడాలి. ఈ సారి కూడా కెప్టెన్సీ టాస్కుని సాగదీస్తాడా లేక ఈ ఒక్క దాంతోనే ముగిస్తాడా చూడాలి.