Bigg Boss 5: నేడు క్వారంటైన్‌కు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు!

తెలుగులో మోస్ట్ అవెయిటెడ్ రియాలిటీ షో బిగ్ బాస్ ఫీవర్ మొదలైంది. బిగ్ బాస్ కొత్త సీజన్ అనగానే ఈ సీజన్ హోస్ట్ ఎవరు అని ముందు చర్చ జరగగా ఈ సీజన్ కూడా నాగార్జునే హోస్ట్..

Bigg Boss 5: నేడు క్వారంటైన్‌కు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు!

Bigg Boss 5 Logo

Bigg Boss 5: తెలుగులో మోస్ట్ అవెయిటెడ్ రియాలిటీ షో బిగ్ బాస్ ఫీవర్ మొదలైంది. బిగ్ బాస్ కొత్త సీజన్ అనగానే ఈ సీజన్ హోస్ట్ ఎవరు అని ముందు చర్చ జరగగా ఈ సీజన్ కూడా నాగార్జునే హోస్ట్ అని కన్ఫర్మ్ కావడంతో అందరి దృష్టి కంటెస్టెంట్ల మీద పడింది. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 5కి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో షోపై చర్చలు కూడా ఆసక్తికరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కొందమంది పేర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ప్రచారంలో ఉన్న పేర్లలో ఎంతమంది బిగ్ బాస్ హౌస్ గడపతొక్కుతారో ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఏవీ షూట్ కూడా పూర్తిచేయగా నేటి నుండి హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లకు క్వారంటైన్ విధించనున్నారు. ఆగష్టు 26 నుండి సెప్టెంబర్ 3 వరకు కంటెస్టెంట్లను హైదరాబాద్ నగరంలో ఐటీసీకి చెందిన ఫైవ్ స్టార్ హోటల్లో క్వారంటైన్ కి పంపనున్నారట. దీనిని బట్టి చూస్తే సెప్టెంబర్ మొదటి వారం నుండి బిగ్ బాస్ షూటింగ్ మొదలు కానున్నట్లు కనిపిస్తుంది.

ఇక క్వారంటైన్ కి వెళ్తున్న కంటెస్టెంట్లు వీరే అంటూ సోషల్ మీడియాలో ఒక లిస్ట్ ప్రచారంలో ఉంది. ఇందులో యాంకర్ రవి, 7 ఆర్ట్స్ సరయు సుమన్, మహా న్యూస్ లహరి, కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్, యాంకర్ కమ్ నటుడు లోబో, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీ, ఆర్జే కాజల్, ఫోక్ సింగర్ కోమలి, యాంకర్ కమ్ నటి వర్షిణి, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, సీరియల్ నటి నవ్య స్వామి, క్యారక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి, సిరి హనుమంత్, టిక్ టాక్ స్టార్ దుర్గారావు పేర్లు వినిపిస్తున్నాయి.