Bigg Boss 5 : వీళ్లు ఫిక్స్ అయిపోయారు..

కొంతమంది కంటెస్టెంట్స్ ఫైనల్ అయిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి..

Bigg Boss 5 : వీళ్లు ఫిక్స్ అయిపోయారు..

Bigg Boss 5 Telugu Contestants List

Bigg Boss 5: వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ గత నాలుగు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని ఇప్పుడు 5వ సీజన్‌తో ఆడియెన్స్‌కి మోర్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించడానికి రాబోతుంది. వరుసగా మూడోసారి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ఇటీవల వదిలిన ప్రోమోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది కంటెస్టెంట్స్ ఫైనల్ అయిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఆ వివరాలేంటో చూద్దాం..

Bigg Boss 5 : ‘బోర్‌డమ్‌కి గుడ్‌బై.. వచ్చేస్తుంది బిగ్ బాస్ సీజన్ ఫైవ్’..

అనీ మాస్టర్ – రియాలిటీ షోకి జడ్జిగా వ్యవహరిస్తూ స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేసే అనీ మాస్టర్ సిల్వర్ స్క్రీన్ మీద పాపులర్ హీరో హీరోయిన్లతో అదిరిపోయే స్టెప్పులు వేయించారు.

 

View this post on Instagram

 

A post shared by Anee Master (@aneemaster)

RJ కాజల్ – ఓ పాపులర్ ఎఫ్ఎమ్ స్టేషన్లో సినిమా ప్రోగ్రాం ద్వారా పాపులర్ అయింది విజయవాడ అమ్మాయి కాజల్.. తన వాయిస్ బాగుండడంతో పలు సినిమాల్లో హీరోయిన్లతో పాటు ఇతర క్యారెక్టర్లకు డబ్బింగ్ చెప్పింది. అలాగే కొన్ని పాటలు కూడా పాడింది.

 

View this post on Instagram

 

A post shared by RJ Kajal️️️️️️ (@kajalrj)

షణ్ముఖ్ జస్వంత్ – ‘సాఫ్ట్వేర్ డెవలపర్’ అనే వెబ్ సిరీస్తో పాపులర్ అయ్యాడు. ఇందులో తను చేసిన షాను క్యారెక్టర్ యూత్కి కనెక్ట్ అయింది. తన నటనకు మంచి పేరు వచ్చింది. సోషల్ మీడియాలోనూ షణ్ముఖ్కి భారీ ఫాలోవర్స్ ఉన్నారు.

యాంకర్ రవి – మేల్ యంగ్ యాంకర్లలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రవి. బుల్లితెర మీద సందడి చేస్తూనే వెండితెర మీద హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Anchor Ravi (@anchorravi_offl)

యాంకర్ వర్షిణి – బుల్లితెర ఫీమేల్ యాంకర్లలో వర్షిణి సపరేట్ రికగ్నైజేషన్ ఉంది. టీవీ షోలతో అలరించిన వర్షిణి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఎలాంటి సందడి చేస్తుందోనని ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Varshini (@varshini_sounderajan)

లోబో – పలు ప్రైవేట్ షోలతో పక్కా హైదరాబాదీ యువకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న లోబో కూడా బిగ్ బాస్ సీజన్ 5లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Lobo (@lobo__619)