Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ కంటెస్టెంట్లు వీళ్ళే.. ఎవరు మీ ఫేవరెట్?

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ వచ్చేసింది. నాలుగు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ గేమ్ షో ఇప్పుడు సీజన్ 5తో..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ కంటెస్టెంట్లు వీళ్ళే.. ఎవరు మీ ఫేవరెట్?

Bigg Boss 5 Telugu

Bigg Boss 5 Telugu: తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ వచ్చేసింది. నాలుగు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ గేమ్ షో ఇప్పుడు సీజన్ 5తో సందడి చేయడానికి మన ముందుకు వచ్చేసింది. నాగార్జున అక్కినేని హోస్టుగా 5 మచ్ ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. ఈ సారి 19 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లగా.. ఎప్పట్లాగే ఈ సారి కూడా అదిరిపోయేలా ఎపిసోడ్ మొదలు పెట్టాడు నాగార్జున. బిగ్ బాస్ మొదలవడంతో ఒక్కసారిగా తెలుగు బుల్లితెర కలర్ ఫుల్ గా మారిపోయింది.

నాగ్‌ అదిరే గ్రాండ్‌ ఎంట్రీతో మొదలైన ఈ షోలో ‘సీజన్‌-5’లో పాల్గొనే కంటెస్టెంట్‌లను పరిచయం చేశారు. గతంలో 16 మంది కంటెస్టెంట్లతో నడిచిన ఈ షోలో ఈ సీజన్ లో మొత్తం 19మంది కంటెస్టెంట్‌లు హౌస్‌లోపలికి వెళ్లారు. సిరి హనుమంత్‌ మొదటి కంటెస్టెంట్‌ కాగా, యాంకర్‌ రవి చివరిగా వెళ్లారు. కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్లడమే ఆలస్యం టాస్కులు కూడా మొదలు పెట్టాడు బిగ్ బాస్. హౌస్ లో ‘సింగిల్‌ బెడ్‌’ కోసం నాలుగు విడతల్లో టాస్క్ లు ఇవ్వగా విజయ్‌ సన్నీ, ప్రియాంక సింగ్‌, విశ్వ, మానస్‌ ఈ టాస్కులలో గెలిచి సింగల్ బెడ్స్ దక్కించుకున్నారు.

ఇక సిరి హనుమంతుతో మొదలైన కంటెస్టెంట్ల ఎంట్రీలో ఆ తర్వాత వరసగా వీజే సన్నీ, లహరి శారి, సింగర్ శ్రీ రామ్ చంద్ర, డ్యాన్స్ మాస్టర్ అనీ, లోబో, ప్రియా, జెస్సీ (సూపర్ మోడల్ ర్యాంప్ వాకర్), ట్రాన్స్ జెండర్ జబర్దస్త్ ప్రియాంక, షణ్ముఖ్ జస్వంత్, హమీదా ఖాటూన్, న‌ట‌రాజ్ మాస్టర్‌, సరయు, యాక్టర్ విశ్వా, ఉమాదేవి (సీరియల్ నటి), నటుడు మానస్ నాగులపల్లి, ఆర్.జే కాజల్ (రేడియో జాకీ, డబ్బింగ్ ఆర్టిస్ట్), శ్వేతా, యాంకర్ రవిని కింగ్ నాగ్ హౌస్ లోకి పంపారు. కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్లడంతో ఇక సోషల్ మీడియాలో ఎవరు మీ ఫేవరెట్ అంటూ సందడి కూడా మొదలైపోయింది.