Bigg Boss 5 Telugu : ప్రోమోలో ఉన్నది ఏపిసోడ్‌లో ఉండదు.. అదే మ్యాజిక్..!

‘బిగ్ బాస్ 5’ ఇవాళ్టి ఎపిసోడ్‌లో యాంకర్ రవి, ఆర్‌జే కాజల్ ‘బీబీ న్యూస్’ పేరుతో ఇంటి సభ్యులను ఇంటర్వూ చెయ్యబోతున్నారు..

Bigg Boss 5 Telugu : ప్రోమోలో ఉన్నది ఏపిసోడ్‌లో ఉండదు.. అదే మ్యాజిక్..!

Bb 5

Bigg Boss 5 Telugu: కాంట్రవర్శీలు, గొడవలు, అలకలు, బుజ్జగింపులు, ఏడుపులు, పొడబెబ్బలు.. ఇలా బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరిగినా కానీ అది ఎంటర్‌‌టైన్‌మెంట్ కిందకే వస్తుంది. కింగ్ నాగార్జున ఇంటి సభ్యులతో మామూలుగా ఆడుకోవడం లేదసలు.

Bigg Boss 5 Telugu : వైరల్ అవుతున్న విష్ణు ప్రియ కామెంట్స్..

ఇక రెండో వారంలో కంటెస్టెంట్స్ అంతా మరింత హుషారుగా కనిపిస్తున్నారు. లవ్, ఎమోషన్స్‌తో అందరూ సరదాగా సందడి చేస్తున్నారు. ఇక శుక్రవారం ‘బీబీ న్యూస్’ అనే కాన్సెప్ట్ తీసుకుని సభ్యులందరి గురించి అంటే వారి మనసులో మాట తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఆకట్టకుంటుంది.

Love Story : చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా చైతు సినిమా ఫంక్షన్..

ఇక బిగ్ బాస్ స్టార్ అయినప్పటినుంచి సోషల్ మీడియాలో మీమ్స్ ఎంతలా హల్ చల్ చేస్తున్నాయో కొత్తగా చెప్పక్కర్లేదు. కొన్నిసార్లు ప్రోమోల ఉన్న సంఘటనలు ఎపిసోడ్‌లో ఉండవు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ప్రోమోలో చూపించినట్లు లవ్, ఇంకా మనసులో మాటలకు సంబంధించి అన్ని విషయాలూ చూపిస్తారా లేక కట్ చేస్తారా అనే డౌట్ ఎక్స్‌ప్రెస్ చేస్తూ.. ‘ప్రోమోలో ఉన్నది ఏపిసోడ్‌లో ఉండదు.. అదే మ్యాజిక్..!’ అంటూ రకరకాల మీమ్స్ వైరల్ అవుతున్నాయి.