బిగ్ బాస్ సర్ ప్రైజ్: ఈ వీక్ నో ఎలిమినేషన్.. రీ ఎంట్రీ ఓటింగ్!

  • Edited By: vamsi , September 17, 2019 / 10:59 AM IST
బిగ్ బాస్ సర్ ప్రైజ్: ఈ వీక్ నో ఎలిమినేషన్.. రీ ఎంట్రీ ఓటింగ్!

బిగ్ బాస్ అంటేనే సర్ ప్రైజ్.. ఆయన ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందో? ఎలాంటి టాస్క్ లు ఇస్తాడో? ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఎవరూ చెప్పలేం. ఇప్పటికే 8వారాల బిగ్ బాస్ కార్యక్రమం అయిపోయింది. ఏడు ఎలిమినేషన్లు జరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఈ వారం త్యాగం చేయడం ద్వారా నామినేషన్లను ఫిక్స్ చేస్తున్నారు బిగ్ బాస్. అయితే ఈ వారం బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇవ్వబోతున్నాడట. అదేమిటంటే.. ఇప్పటివరకు ఏడుగురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి ఎలిమినేట్ అవగా.. వాళ్లలో ఇద్దరిని తిరిగి మళ్లీ హౌస్ లోకి ఎంట్రీ ఇప్పించాలని నిర్ణయం తీసుకున్నారట.

ఈ క్రమంలోనే తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేషన్ లేదట. ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల నుంచి ఒకరిని మళ్లీ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇప్పించనున్నారట. ఈ క్రమంలో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎలిమినేట్ అయిన నటి హేమ, జర్నలిస్ట్ జాఫర్, టీవీ నటి రోహిణి, నటి అషూ రెడ్డి, టీవీ నటుడు అలీ రజా… అలాగే వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలో వచ్చిన తమన్నా, శిల్పా లకు పోలింగ్ నిర్వహించి ఇద్దరిని హౌస్ లోకి తీసుకోవాలని భావిస్తున్నారు.

ఇప్పటివరకు ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లలో ఇద్దరిని తీసుకుని రావాలని బిగ్ బాస్ భావిస్తుంటే.. అలీ రెజాకు అందరి కంటే ఎక్కువ అవకాశం ఉంది. అలాగే రోహిణి కూడా అనవసరంగా ఎలిమినేట్‌ అయిందనే అభిప్రాయం కొంతమందిలో ఉంది. వీరిద్దరూ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత సీజన్ లో ఇటువంటి రీ ఎంట్రీ పెట్టినప్పుడు.. భారీ ఓట్లను సాధించి నూతన్‌ నాయుడు, శ్యామల తిరిగా హౌస్‌లోకి వచ్చారు.