Bigg Boss 5 : పేడలో పడి దొర్లాడి టాస్క్ గెలిచాడు సరే.. కెప్టెన్ అవుతాడా??

ప్రతి సారి కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి కఠినమైన టాస్కులే ఇస్తాడు. ఈ సారి ఇంకా కష్టతరమైన టాస్కులను ఇచ్చాడు బిగ్ బాస్. ఇంటి సభ్యుల్లో లోబో, షణ్ముఖ్‌ లకు ఆవుపేడలో

Bigg Boss 5 :  పేడలో పడి దొర్లాడి టాస్క్ గెలిచాడు సరే.. కెప్టెన్ అవుతాడా??

Biggboss (1)

Bigg Boss 5 :  బిగ్ బాస్ లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం గొడవలు బాగా జరుగుతాయి. ఇంటి సభ్యులు కెప్టెన్ అవ్వడం కోసం గట్టుగానే పోరాడతారు. ప్రతి సారి కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి కఠినమైన టాస్కులే ఇస్తాడు. ఈ సారి ఇంకా కష్టతరమైన టాస్కులను ఇచ్చాడు బిగ్ బాస్. ఇంటి సభ్యుల్లో లోబో, షణ్ముఖ్‌ లకు ఆవుపేడలో ముత్యాలు ఏరే టాస్క్ ఇచ్చాడు. సిరి, రవి స్విమ్మింగ్‌ఫూల్‌లో సీసాలు ఏరే టాస్క్ ఇచ్చాడు. మానస్‌, శ్రీరామచంద్రలకు బలమైన తాళ్లను ఊపే టాస్క్ ఇచ్చారు. యాని మాస్టర్, ప్రియాంకలకి పెయింటింగ్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.

Samantha : పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత

సిరి, రవి స్విమ్మింగ్‌ఫూల్‌లో సీసాలు ఏరే టాస్కులో సిరి గెలిచింది. మానస్‌, శ్రీరామచంద్రలు బలమైన తాళ్లను అలిసిపోయి ఆగిపోయేదాకా ఉపాలి ఇందులో మానస్ మధ్యలోనే ఆయాసంతో ఆపేసాడు. శ్రీరామ్ మాత్రం చెమటలు కక్కుతున్న తాళ్ళని ఊపుతూనే ఉన్నాడు. దీంతో శ్రీరామ్ విన్ అయ్యాడు. ఇక లోబో, షణ్ముఖ్ లు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వకపోవడంతో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. వీళ్లిద్దరికీ పేడ కలిపిన మట్టిలో కొన్ని ముత్యాలను వేసి ఆ ముత్యాలని ఒక్కొక్కటిగా బయటకి తీయాలని టాస్క్ ఇచ్చారు. ఇద్దరూ ఆ పేడలో దొర్లాడి ముత్యాలను ఏరారు. ఇచ్చిన టైంలో షన్ను 101 ముత్యాలను ఏరగా లోబో 74 ఏరాడు. దీంతో షన్ను ఈ టాస్క్ లో గెలిచాడు. అయితే షణ్ముఖ్ ముత్యాలు నీట్‌గా లేవని కొంతమంది కంటెస్టెంట్స్ అనడంతో నీట్‌గా ఉండటం మ్యాటర్ కాదు, ఎవరు ఎక్కువ తీస్తే వాళ్లే గెలిచినట్టు అని చెప్పడంతో షన్నుని ఈ టాస్కులో విజేతగా ప్రకటించారు. దీంతో సిరి వచ్చి షన్నుకి గట్టిగా హాగ్ ఇచ్చింది.

Ghani : నిన్నెంటి.. మొన్నెంటి.. నీకెందుకు.. ‘గని’ నుంచి అదిరిపోయే ఇన్స్పిరేషనల్ సాంగ్

ఇక యాని మాస్టర్, ప్రియాంకలకి ఒక వైట్ బోర్డు ఇచ్చి ఇద్దరికీ రెండు రంగులు ఇచ్చారు. ఆ రంగులతో బోర్డుని నింపాలి. ఎవరు ఎక్కువగా డామినేట్ చేసేలాగా కలర్ పూస్తారో వాళ్ళు విన్ అయినట్టు. అయితే ఈ టాస్క్ లో పెయింట్ వల్ల ఇద్దరూ జారీ పడ్డారు. వాళ్ళకి దెబ్బలు ఏమన్నా తగిలాయా లేదా ఎవరు గెలిచారో తెలియాలంటే ఇవాళ్టి ఎపిసోడ్ చూడాలి. ఈ టాస్కుల్లో గెలిచిన అందరికి కలిపి మరో పెద్ద టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్ అందులో గెలిచిన వాళ్ళు కెప్టెన్ అవుతారని ప్రకటించాడు. మరి ఈ సారి కొత్త కెప్టెన్ వస్తారా లేక ఆల్రెడీ కెప్టెన్ అయినా వాళ్ళే మళ్ళీ కెప్టెన్ అవుతారా ఇవాళ రాత్రి ఎపిసోడ్ లో చూడాలి.