Gangavva: గంగవ్వ గృహప్రవేశం.. కొత్త ఇల్లు ఎంత అందంగా ఉందో!

యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ కంటెస్టెంట్, నటి గంగవ్వ ఎట్టకేలకు తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లిలో నూతనంగా నిర్మించుకున్న ఇంట్లోకి..

Gangavva: గంగవ్వ గృహప్రవేశం.. కొత్త ఇల్లు ఎంత అందంగా ఉందో!

Gangavva

Gangavva: యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ కంటెస్టెంట్, నటి గంగవ్వ ఎట్టకేలకు తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లిలో నూతనంగా నిర్మించుకున్న ఇంట్లోకి గంగవ్వ గృహప్రవేశం చేసింది. బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్ గా ఇంట్లో అడుగుపెట్టిన గంగవ్వ ఉన్న ఐదు వారాల్లోనే మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే అనారోగ్య కారణంగా అప్పుడు ఇంట్లో నుండి బయటకి రావాల్సి వచ్చిన గంగవ్వ తన చిరకాల కోరికను హోస్ట్ నాగార్జున ముందు పెట్టింది.

Anushka Shetty: స్వీటీ మనసు స్వీట్.. అందంలో అప్సరస!

దీంతో నాగార్జున గంగవ్వకి ఇల్లు కట్టిస్తానని.. ఆ బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చినట్లుగానే నాగార్జున బిగ్ బాస్ షో నుండి ఆమెకి ఇంటికి సహాయసహకారాలు అందించారు. మొత్తం బిగ్ బాస్ నుండి గంగవ్వ ఇంటి కోసం రూ.11 లక్షల రూపాయలు అందినట్లు తెలుస్తుండగా గంగవ్వ మరో మూడు లక్షలు ఆమె చేతి డబ్బుతో మొత్తానికి ఆమె ఇంటి కల నెరవేర్చుకుంది. తాజాగా కొత్త ఇంట్లో గంగవ్వ గృహప్రవేశం చేయగా.. ఈ కార్యక్రమానికి బిగ్‌బాస్‌ నాలుగో సీజన్ కంటెస్టెంట్లు కూడా హాజరయ్యారు.

Kamal Haasan: మరో సెన్సేషనల్ దర్శకుడితో.. కమల్ లైనప్ అదుర్స్!

బిగ్ బాస్ కంటెస్టెంట్లు అఖిల్‌, శివజ్యోతితో పాటు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మై విలేజ్‌ షో టీం సభ్యులు సహా ఈ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. గంగవ్వ గృహప్రవేశానికి సంబంధించిన వీడియోను మై విలేజ్‌ షో టీం యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయగా వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో యూట్యూబ్లో కాసేపటికే ట్రెం‍డింగ్‌లో నిలిచిందంటే గంగవ్వ క్రేజ్ ఏంటో తెలుసుకోవచ్చు. ఇక ఇప్పుడు గంగవ్వ యూట్యూబ్ తో పాటు పలు సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా మారిపోతున్న సంగతి తెలిసిందే.