Bigg Boss 5 : నీ సొంత వైద్యం ప్రయత్నించకు.. ప్రియాంకకి షాక్ ఇచ్చిన బిగ్‌బాస్
ఇప్పటికే ఆమె చేసిన వైద్యం వల్ల శ్రీరామ్ బెడ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పుడు కొత్తగా సిరికి సలహా ఇస్తుండటంతో వెంటనే బిగ్‌బాస్ స్పందించాడు. సిరికి ప్రియాంక సలహా ఇస్తుంటే బిగ్ బాస్....
Bigg Boss 5 : బిగ్ బాస్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఎవరు ఫైనల్ కి వెళ్తారు అనే టాస్కులు జరుగుతున్నాయి. బిగ్‌బాస్ షోలో నిన్నటి దాకా ముఖ్యమైన ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్ జరిగింది. ఈ టాస్క్ లో గెలిచిన వాళ్ళు డైరెక్ట్ గా ఫైనల్ కి అర్హత సాధించినట్లే. అయితే ఈ టాస్క్ లో భాగంగా మొన్నటి ఎపిసోడ్ లో ఐస్ వాటర్‌లో కాళ్లు పెట్టి ఆడటం వల్ల అందరికి కాళ్ళు తిమ్మిరి ఎక్కిపోయాయి. ఐస్ వాటర్ నుంచి బయటకు రాగానే వేడినీళ్లు పోయడం హానికరమని ముందే వార్నింగ్ ఇచ్చాడు బిగ్‌బాస్. అయితే శ్రీరామ్ ఎక్కువ సేపు ఐస్ వాటర్ లో ఉండటంతో కాళ్ళు బాగా తిమ్మిరెక్కాయి అని రాత్రి నిద్ర పోకుండా కాళ్ళ నొప్పులతో బాధపడుతుంటే ప్రియాంక… శ్రీరామ్ కాళ్లకు అర్ధరాత్రి జండూబామ్ రాసి కాళ్లపై వేడినీళ్లు పోసి మసాజ్ చేసింది. దీంతో అతడి కాళ్ళు వాచి నొప్పి మరింత ఎక్కువైంది. దీంతో వెంటనే శ్రీరామ్‌ను మెడికల్ రూమ్‌లోకి పిలిచి మందులు రాసిచ్చారు. దీంతో ప్రియాంక వల్ల ఆశ్రీరాం బెడ్‌కే పరిమితమయ్యాడు.
Allu Arjun Rashmika : ‘ఐకాన్ స్టార్’కి స్పెషల్ గిఫ్ట్ పంపించిన రష్మిక
తాజాగా నిన్నటి ఎపిసోడ్ లో సిరికి మోషన్స్ అవుతున్నాయంటే ప్రియాంక ఏదో సలహా ఇవ్వడానికి ట్రై చేసింది. షుగర్ వాటర్ తాగమని, అరటిపండు తినమని తనకు తోచిన సలహాలు ఇచ్చింది. ఇప్పటికే ఆమె చేసిన వైద్యం వల్ల శ్రీరామ్ బెడ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పుడు కొత్తగా సిరికి సలహా ఇస్తుండటంతో వెంటనే బిగ్‌బాస్ స్పందించాడు.
Niharika – Chaitanya : నన్ను పట్టించుకోకుండా నిహారికకు ఎప్పుడూ అదే పని : నిహారిక భర్త
సిరికి ప్రియాంక సలహా ఇస్తుంటే బిగ్ బాస్ మధ్యలో మాట్లాడుతూ.. నీకోసం కానీ, ఇతర ఇంటిసభ్యుల కోసం కానీ నీ సొంత వైద్యం చేయడం మంచిది కాదు అని అన్నాడు. దీంతో ప్రియాంక హర్ట్ అయింది. ఇది కూడా నిజమే కదా అని ప్రేక్షకులు అంటున్నారు. కరెక్ట్ టైంకి బిగ్ బాస్ చెప్పకపోతే సిరికి ఇంకో ప్రాబ్లమ్ వచ్చేదేమో అనుకుంటున్నారు ప్రేక్షకులు. ఈ దెబ్బతో అయినా ప్రియాంక ఇంకోసారి ఇంటి సభ్యులకు ఉచిత సలహాలు ఇవ్వడం మానేస్తుందేమో చూడాలి.