Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ గేమ్ ప్లాన్.. ఓటీటీ కోసం మాజీ కంటెస్టెంట్లు?

బిగ్ బాస్ గేమ్ షోకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతుంది. మన దేశంలో అయితే.. ఈ షోకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ గేమ్ ప్లాన్.. ఓటీటీ కోసం మాజీ కంటెస్టెంట్లు?

Bigg Boss Telugu Ott

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ గేమ్ షోకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతుంది. మన దేశంలో అయితే.. ఈ షోకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే హిందీలో 15 సీజన్లతో పాటు ఓటీటీ కూడా ఓ సీజన్ పూర్తయింది. ఇక తెలుగులో ఐదు సీజన్లు పూర్తిచేసుకోగా ఆరవ సీజన్ కు మూడు నాలుగు నెలలు పట్టేలా కనిపిస్తుంది. అయితే.. ఈలోగా ప్రేక్షకుల ఆసక్తిని క్యాష్ చేసుకొనేందుకు షో యాజమాన్యం తెలుగులో కూడా ఓటీటీ తొలి సీజన్ మొదలు పెట్టనున్నారు.

All of Us Are Dead: నెట్ ఫ్లిక్స్ లో దూసుకుపోతున్న మరో కొరియన్ సిరీస్!

ఇప్పటికే బిగ్ బాస్ 5 ఫైనల్స్ స్టేజి మీద నుండే హోస్ట్ నాగార్జున అధికారికంగా ప్రకటించగా ఓటీటీకి కూడా ఆయనే హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. ప్రముఖ బుల్లి తెర యాంకర్‌ ఓంకార్‌ ‘ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ సంస్థ ఈ ఓటీటీ షోను నిర్వహించనున్నట్లు తెలుస్తుండగా అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఈ షో మొదలు కానుంది. అందుకే కంటెస్టెంట్లు.. తెర పనులకు కూడా మొదలు పెట్టారు షో నిర్వాహకులు.

Shalini Pandey: హద్దులు చెరిపేసి షాలిని హాట్ అవతార్!

అయితే.. ఓటీటీ తొలి సీజన్ కు హైప్ తెచ్చేందుకు గతంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లను కూడా రంగంలోకి దింపేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వచ్చిన క్రేజ్ ను బాగా యూజ్ చేసుకున్న కంటెస్టెంట్ అరియనా. అదే బిగ్ బాస్ ఐదవ సీజన్ కు టీవీ షోకు హోస్ట్ గా కూడా చేసిన అరియనా ఇప్పుడు ఓటీటీ తొలి సీజన్ లో కంటెస్టెంట్ గా మారనుందట. ఇప్పటికే సంప్రదించిన షో నిర్వాహకులకు అరియనా నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తుంది.

Bigg Boss 15: దేశవ్యాప్తంగా ఉత్కంఠ.. ఈ సీజన్ బిగ్ బాస్ విన్నర్ ఎవరు?

అరియనాతో పాటు మాజీ కంటెస్టెంట్లు ఆదర్శ్, తనీష్, అఖిల్, అలీ రెజా, హరితేజలు కూడా ఓటీటీ బిగ్ బాస్ తొలి సీజన్ లో ఇంట్లోకి వెళ్లేందుకు సిద్దమైనట్లు వినిపిస్తుండగా కొత్తగా.. యాంకర్‌ వర్షిణి, యాంకర్‌ శివ, డ్యాన్స్‌ షో ‘ఢీ-10’ విజేత రాజు, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌’వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ వైష్ణవి, సోషల్‌ మీడియా స్టార్‌ వరంగల్‌ వందన, యాకర్‌ ప్రత్యూష పేర్లు ఓటీటీ బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా వినిపిస్తున్నాయి.