Bigg Boss: ఈసారి కథ వేరే ఉంటది.. బిగ్‌బాస్‌లో సీక్రెట్‌గా.. పక్కా వ్యూహంతో!

బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్ మినహాయిస్తే, మిగతా సీజన్‌లు మొత్తం ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారో ముందే తెలిసిపోతూ ఉండడంతో అసలు గేమ్ మజా మిస్ అయ్యింది అంటూ చాలామంది అభిప్రాయపడ్డారు. ప్రతీసారి ఒకరోజు ముందుగానే ఎవరు వెళ్లిపోతున్నారు అనే విషయం తెలిసిపోతూ వచ్చింది.

Bigg Boss: ఈసారి కథ వేరే ఉంటది.. బిగ్‌బాస్‌లో సీక్రెట్‌గా.. పక్కా వ్యూహంతో!

Bigg Boss Telugu: బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్ మినహాయిస్తే, మిగతా సీజన్‌లు మొత్తం ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారో ముందే తెలిసిపోతూ ఉండడంతో అసలు గేమ్ మజా మిస్ అయ్యింది అంటూ చాలామంది అభిప్రాయపడ్డారు. ప్రతీసారి ఒకరోజు ముందుగానే ఎవరు వెళ్లిపోతున్నారు అనే విషయం తెలిసిపోతూ వచ్చింది. ఈసారి మాత్రం అలా కాకుండా.. కచ్చితంగా ఎపిసోడ్‌లో హోస్ట్ అనౌన్స్ చేసినప్పుడే తెలిసుకునేలా పక్కా వ్యూహం వెయ్యాలని ఫిక్స్ అయ్యారు నిర్వాహకులు.

ఇందుకోసం కొత్తగా అన్నపూర్ణ స్టూడియోలోనే ఫుల్ సెక్యురిటీ ఏర్పాటుచేసి ఏ కంటెస్టెంట్ వెళ్లిపోతున్నారు అనేది బయటకు రాకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. ఫస్ట్ సీజన్‌లో మహారాష్ట్రాలో జరగగా పెద్దగా ఎవరికీ కంటెస్టెంట్ వివరాలు తిలిసే పరిస్థితి లేదు.. కానీ, మిగిలిన మూడు సీజన్లు కూడా హైదరాబాద్‌లోనే జరిగాయి.. అందుకే సమాచారం ఎక్కువగా లీక్ అవుతూ వచ్చింది.

ఈసారి మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్‌లో సమాచారం లీక్ కాకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఈసారి లీక్‌లు రాకుండా ఉండేందుకు ప్రణాళికను రూపొందించడంతో పరిస్థితులు మారబోతున్నాయి. ఎలిమినేట్ అయ్యే వ్యక్తి కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

ఇప్పటికే బిగ్‌బాస్ ఐదవ సీజన్‌ కోసం ఏర్పాట్లను పూర్తిచేస్తుండగా.. కంటెస్టెంట్లను దాదాపుగా ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. వచ్చే నెల ఆగస్ట్ చివరివారంలో షో మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది.