Bigg Boss Telugu 4 Day 3 Gangavva : బాబోయ్.. గంగవ్వ దెబ్బకు బిగ్‌బాస్ రికార్డులు షేక్..!

  • Published By: sreehari ,Published On : September 9, 2020 / 07:56 PM IST
Bigg Boss Telugu 4 Day 3 Gangavva : బాబోయ్.. గంగవ్వ దెబ్బకు బిగ్‌బాస్ రికార్డులు షేక్..!

Bigg Boss Telugu 4- Gangavva : గంగవ్వ.. మొన్నటి వరకు ఈ పేరు కేవలం యూట్యూబ్ రెగ్యులర్‌గా చూసే వాళ్లకు మాత్రమే తెలుసు. మై విలేజ్ షో అంటూ ఒకటుందని.. అందులో గంగవ్వ ఉందని తెలుసు. కానీ, ఇప్పుడు మాత్రం అలా కాదు. బిగ్ బాస్ ఇంటికి రావడంతో అందరికీ అవ్వ అంటే ఏంటో తెలిసిపోయింది. పైగా ఈమె స్పెషల్ కంటెస్టెంట్ అంటూ నాగార్జున కూడా పదేపదే చెప్పడంతో ఆమెపై అందరికీ ఆసక్తి పెరిగిపోయింది. ఇప్పుడు ఈమె తొలి వారం నామినేషన్స్‌లో ఉంది.



గంగవ్వ దెబ్బకు రికార్డులు షేక్ అవుతున్నాయి. ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఎవరికీ రానంత.. లేనంత పాపులారిటీ గంగవ్వకు వస్తుంది. ఈమె ఫాలోయింగ్ చూసి నిజంగానే అందరికీ మెంటల్ వచ్చేస్తుంది. బాబోయ్ అవ్వ.. ఏంది నీ క్రేజ్ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పోల్ అవుతున్న ఓట్లలో కూడా… గంగవ్వ సరికొత్త రికార్డులు నెలకొల్పడం పక్కా అనిపిస్తోంది.



అసలు కనివినీ ఎరుగని రీతిలో ఈమెకు ఓట్లు పడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పైగా హాట్ స్టార్‌లో ఒక్కొక్కరు పది ఓట్లు వేసే వీలుంది. ఇప్పటి వరకు ఈ రెండ్రోజుల్లో పడిన ఓట్లలో 50 శాతం పైగా అవ్వకే గుద్దేశారు ఆడియన్స్. వీకెండ్ అయ్యేలోపు ఈలెక్క ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఉన్న ఫాలోయింగ్ చూస్తుంటే గంగవ్వ ఈజీగా సేఫ్ అయిపోవడమే కాదు.. బిగ్ బాస్‌లో గట్టి కంటెస్టెంట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.