Bigg Boss 5 : నాకు మానస్ కి ఇవ్వాలని ఉంది.. కేక్ ముక్క కోసం కంటెస్టెంట్స్

ఇవాళ తాజాగా రిలీజ్ అయిన ప్రోమో చూస్తుంటే ఇవాళ్టి ఎపిసోడ్ లో కొంచెం ఫన్ ఉండబోతుందని తెలుస్తుంది. కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్‌ ఓ డిష్ ని పంపాడు. హౌస్ గార్డెన్ మధ్యలో ఓ టేబుల్ వేసి

Bigg Boss 5 :  నాకు మానస్ కి ఇవ్వాలని ఉంది.. కేక్ ముక్క కోసం కంటెస్టెంట్స్

Bb5

Bigg Boss 5 :  ఇవాళ తాజాగా రిలీజ్ అయిన ప్రోమో చూస్తుంటే ఇవాళ్టి ఎపిసోడ్ లో కొంచెం ఫన్ ఉండబోతుందని తెలుస్తుంది. కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్‌ ఓ డిష్ ని పంపాడు. హౌస్ గార్డెన్ మధ్యలో ఓ టేబుల్ వేసి ఆ డిష్ ని పెట్టి దాని పై గ్లాస్ మూతని బోర్లించాడు. అది చూస్తుంటే ఓ చిన్న కేక్ ముక్కలాగా ఉంది. ఈ డిష్ తో పాటు ఓ నోట్ కూడా అక్కడ పెట్టాడు. నోరూరించే ఫుడ్‌ ఐటమ్‌ను పంపి ‘ఇది తినే అర్హత మీలో ఏ ఒక్కరికి ఉంది?’ అంటూ ఓ నోట్ పెట్టాడు.

RGV Ladki : చైనా ఫిలిం ఫెస్టివల్ కి ఆర్జీవీ సినిమా

దీంతో కంటెస్టెంట్స్ అంతా ఆ డిష్ చుట్టూ చేరారు. కాసేపు యాని మాస్టర్, రవి, శ్రీరామ్ ఆ నోట్ గురించి కామెడీ చేశారు. అందరు దాన్ని చూసి ఇలా అడిగారంటే ఏదో ఉంది అంటూ డిస్కషన్ పెట్టారు. ఇదంతా చూసి సన్నీ ‘ఈ తొక్కలో డిస్కషన్‌ ఏంటో అర్థం కావడం లేదు, పోనీ నేను లటుక్కుమని తినేయనా?’ అని అడిగాడు. కాజల్‌ ఓకే చెప్పినా సన్నీ తినడానికి ట్రై చేయబోతుంటే యానీ మాస్టర్‌ మాత్రం వద్దని ఆపింది.

Jai Bheem : 25 రోజుల్లో ‘జై భీమ్’ కోర్ట్ సెట్.. ఆశ్చర్యపోయిన తమిళనాడు హైకోర్ట్ సిబ్బంది

శ్రీరామ్‌ ఆ డిష్ చుట్టూ మోకాళ్ళతో ప్రదక్షిణలు చేస్తూ టేబుల్ కిందా పైనా చెక్ చేసాడు. యాని మాస్టర్ వాసన చూస్తా అంటూ చూసింది. యానీ నేను కెప్టెన్‌ను కాబట్టి తినడానికి నాకే అర్హత ఉందని చెప్తే సన్నీ తినేసేయ్ అన్నాడు. కాని నేను ఒక్కదాన్నే ఫిక్స్ అవ్వకూడదు, ఇంటిసభ్యుల అభిప్రాయం కూడా కనుక్కుందామని అంది. ఇంతలో ప్రియాంక.. నాకు మానస్‌కు ఇవ్వాలని ఉంది అనగానే సన్నీ.. నువ్వు అన్నీ మానస్‌కే ఇచ్చుకో.. లోపలికి పో అంటూ ఫన్నీ కౌంటర్‌ ఇచ్చాడు. మీకు మేం ఎవ్వరం కనపడం మానస్ తప్ప అంటూ ప్రియాంకని ఏడిపించాడు.

NANI : ఇకపై స్పోర్ట్స్ డ్రామా సినిమాలు చేయను.. కాని : నాని

ఇంతకీ ఈ కేక్‌ ఎవరు తిన్నారు? అసలు తిన్నారా? లేదా? తెలియాలంటే ఇవాళ రాత్రి ఎపిసోడ్ చూడాల్సిందే.