What A Wow-Wow!.. మూడు గెటప్స్‌లో కింగ్ నాగ్..

  • Published By: sekhar ,Published On : August 17, 2020 / 12:32 PM IST
What A Wow-Wow!.. మూడు గెటప్స్‌లో కింగ్ నాగ్..

‘‘వినోదానికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన అతి పెద్ద నాన్‌ ఫిక్షన్‌ షో బిగ్‌బాస్‌.. తెలుగు టెలివిజన్‌లో అత్యుత్తమమైన రేటింగ్స్‌ సాధించిన బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ అతి త్వరలో ప్రారంభం కానుంది’’ అని స్టార్‌ మా ప్రతినిధులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.



గత మూడేళ్లుగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న ‘బిగ్‌బాస్’ కార్యక్రమం నాలుగో సీజన్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా కారణంగా ఆలస్యమైంది. గత సీజన్‌ను హోస్ట్ చేసిన అక్కినేని నాగార్జున ఈ సీజన్‌కు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు. తాజాగా ఈ సీజన్‌కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. యంగ్, మిడిల్, ఓల్డ్‌ గెటప్స్‌లో నాగార్జున కనిపించిన 4వ సీజన్‌ ప్రోమోకి మంచి స్పందన లభించింది.



ఇప్పటికే మూడు సీజన్లతో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించిన బిగ్‌బాస్‌ గతంలో కంటే ఈసారి మరింత ఎంటర్‌టైన్‌ చేసేందుకు రెడీ అయ్యారు.
వరుసగా రెండోసారి బిగ్‌బాస్‌కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగార్జున మాట్లాడుతూ.. ‘‘బిగ్‌బాస్‌ ప్రోమో కోసం మళ్లీ షూటింగ్‌కి రావడం చాలా సరదాగా అనిపించింది. గత సీజన్‌ గొప్ప విజయం అందుకుంది. ఇప్పుడు ప్రేక్షకులకు మరింత వినోదంతో పాటు సర్‌ప్రైజ్‌లు కూడా అందించే ప్రయత్నం చేయబోతున్నాం’’ అన్నారు.