Bigg Boss Telugu 5 Elimination : యాంకర్ రవికి అన్యాయం జరిగిందంటూ.. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఆందోళన

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అనూహ్యంగా యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడు. దీంతో రవి అభిమానులు షాక్ తిన్నారు. కాగా, యాంకర్ రవికి అన్యాయం జరిగింది..

Bigg Boss Telugu 5 Elimination : యాంకర్ రవికి అన్యాయం జరిగిందంటూ.. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఆందోళన

Bigg Boss Telugu 5 Elimination

Bigg Boss Telugu 5 Elimination : తెలుగు బిగ్ బాస్ సీజన్ 5లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అనూహ్యంగా యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడు. దీంతో రవి అభిమానులు షాక్ తిన్నారు. కాగా, యాంకర్ రవికి అన్యాయం జరిగింది అంటూ అభిమానులు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఆందోళనకు దిగారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్పాలని డిమాండ్ చేసిన అభిమానులు.. స్టూడియో దగ్గర ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు.

రవి కంటే తక్కువ ఓట్లు వచ్చినా కొందరిని హౌస్ లోనే కొనసాగిస్తున్నారని వారు ఆరోపించారు. ఓటింగ్ పరంగా చూసుకుంటే థర్డ్ ప్లేస్ లో ఉన్న రవిని ఎలా ఎలిమినేట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కావాలనే చేశారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కొందరు ప్రాంతీయ భావాన్ని తెరమీదకు తెచ్చారు. రవి.. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతోనే ఎలిమినేట్ చేశారని ఆరోపించారు.

Jr NTR Fans : ‘సీఎం ఎన్టీఆర్’.. కుప్పంలో ఫ్యాన్స్ నినాదాలు..

”ప్రముఖ యాంకర్ రవి ఎలిమినేట్ కావడం ఆశ్యర్యం కలిగించింది. రవి కంటే చిన్న సెలెబ్రిటీలు బిగ్ బాస్ హౌస్ లోనే ఉన్నారు. రవి ఫ్యాన్స్ అంతా టీమ్ గా ఏర్పడి చాలా ఓట్లు వేశాము. అయినా ఎలిమినేట్ కావడం బాధాకరం. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి, అచ్చమైన హైదరాబాదీ అయిన యాంకర్ రవిని ఎలిమినేట్ చేయడం బాధాకరం. యాంకర్ రవిని ఎలా ఎలిమినేట్ చేశారో చెప్పాలి. ఫైనల్ వరకు వెళ్తాడని అనున్నాం. ఇలా అర్థాంతరంగా ఎలిమినేట్ అవడం షాక్ కి గురి చేసింది. అన్ని విషయాల్లోనూ రవి నెంబర్ 1.

అలాంటి వ్యక్తిని ఎలా ఎలిమినేట్ చేస్తారు. ప్రాంతీయ వాదమా? మరో కారణమా? అనేది అర్థం కావడం లేదు. యాంకర్ రవి టాప్ 2 లో ఉంటాడని అనుకున్నాము. కానీ, హఠాత్తుగా ఎలిమినేట్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 5 మొత్తం ఎంటర్ టైన్ చేసింది రవినే. రవి బయటకు రావడం అన్ ఫెయిర్. ఓటింగ్ పరంగా చూసుకున్నా థర్డ్ ప్లేస్ లో ఉన్న రవి ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు. రవికున్నంత ఫాలోయింగ్ ఎవరికీ లేదు. రవి లేకుంటే అసలు బిగ్ బాస్ ఎందుకు? మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రవిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోవాలి. బిగ్ బాస్ టాప్ 2లో రవి ఉండాలి” అని అభిమానులు డిమాండ్ చేశారు.

Siva Shankar Master: కరోనాతో శివశంకర్ మాస్టర్ కన్నుమూత

కాగా, ఓటింగ్ పరంగా చూసుకుంటే.. యాంకర్ రవి టాప్ 3లో ఉన్నాడు.. లీస్ట్‌లో సిరి, ప్రియాంక, కాజల్‌లు ఉన్నారు. ఏ పోల్ చూసినా ఇదే రిజల్ట్ వస్తుంది. సిరి-ప్రియాంకలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావచ్చనే అంచనాలను తలకిందులు చేస్తూ యాంకర్ రవిని బిగ్ బాస్ హౌస్ నుంచి పంపేశారు. ఇప్పటికే ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ఎలిమినేషన్స్ జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.