Bigg Boss Telugu 5 : ఈసారి బిగ్‌బాస్ హోస్ట్ నాగ్ కాదట.. నేషనల్ స్టార్ ఎంట్రీ..!

తెలుగు బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్‌ క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నాలుగు సీజన్లు సక్సెస్ ఫుల్‌గా పూర్తిచేసుకున్న అనంతరం ఐదో సీజన్ బిగ్ బాస్ షోతో మళ్లీ బుల్లితెర ప్రేక్షకులను అలరించబోతోంది.

Bigg Boss Telugu 5 : ఈసారి బిగ్‌బాస్ హోస్ట్ నాగ్ కాదట.. నేషనల్ స్టార్ ఎంట్రీ..!

Bigg Boss Telugu 5 Rana Daggubati To Replace Nagarjuna

Bigg Boss Telugu 5 : తెలుగు బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్‌ క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నాలుగు సీజన్లు సక్సెస్ ఫుల్‌గా పూర్తిచేసుకున్న అనంతరం ఐదో సీజన్ బిగ్ బాస్ షోతో మళ్లీ బుల్లితెర ప్రేక్షకులను అలరించబోతోంది. త్వరలోనే ఐదో సీజన్‌ ప్రేకక్షుల ముందుకు రాబోతోంది. బిగ్ బాస్ మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టుగా చేస్తే.. రెండో సీజన్ నేచురల్ స్టార్ నాని హోస్టుగా నడిపించారు. ఇక చివరి రెండు సీజన్లలో వరుసగా అక్కినేని నాగార్జున హోస్టుగా తనదైన శైలిలో సక్సెస్ ఫుల్‌గా నడిపించారు. అయితే ఈసారి ఐదో సీజన్ బిగ్ బాస్ సీజన్ నుంచి హోస్ట్ నాగార్జున తప్పుకున్నట్టు టాక్ నడుస్తోంది. ఈసారి సీజన్‌కు ఓ నేషనల్ స్టార్ ఎంట్రీ ఇస్తున్నాడట. సీజన్ ప్రారంభానికి ముందే బిగ్ బాస్ కంటెస్టెంట్లు, హోస్టు వంటి అంశాలపై హవా మొదలైంది. సెకండ్ వేవ్ కారణంగా ఈసారి బిగ్ బాస్ షో కాస్తా ఆలస్యంగా ప్రారంభం కాబోతోంది.

హోస్ట్ ఎవరనేది ట్రెండింగ్ :
అంతకంటే ముందే బిగ్ బాస్ షోకు సంబంధించి రుమర్లు ఊపందుకున్నాయి. ప్రతిసారీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరు అంటూ లీకులు నడిచేవి.. ఇప్పుడు హోస్ట్ ఎవరు అనే ట్రెండ్ నడుస్తోంది. గత రెండు సీజన్లకు నాగ్ తన షెడ్యూల్స్ ను అడ్జస్ట్ చేసుకుని మరి హోస్ట్ గా షోను విజయవంతంగా ముందుకు నడిపించారు. ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు నాగార్జున షూటింగ్ ప్రాజెక్ట్‌లతో మరింత బిజీగా ఉన్నారు. అందుకే ఐదో సీజన్ నాగ్ హోస్టుగా ఉండే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఐదో సీజన్ నుంచి కింగ్ నాగార్జున తప్పుకున్నారంటూ టాక్ నడుస్తోంది. ఆయన స్థానంలో నేషనల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న రానా దగ్గుబాటి రంగంలోకి దిగుతున్నాడనే టాక్ జోరుగా నడుస్తోంది. సోషల్ మీడియాలోనూ లీకువీరులు తెగ హల్ చల్ చేసేస్తున్నారు.

అదేగాని నిజమైతే ఐదో సీజన్ మాములుగా ఉండదిక.. అసలే రానా నేషనల్ స్టార్‌.. అందులోనూ ఆయన షోలకు హోస్ట్ చేయడం కొత్తేమి కాదు.. ఇప్పటికే కొన్ని షోలతో ఎంతో ఆకట్టుకున్నాడు రానా. వచ్చే ఆగస్టు చివరి వారంలోగానీ సెప్టెంబర్ మొదటివారంలో బిగ్ బాస్ ఐదో సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే ఈసారి సీజన్ లో బిగ్ బాస్ హౌజ్ లోకి టెలివిజన్ సెలబ్రిటీలు, నటులు మాత్రమే కాకుండా యూట్యూబర్లు, సోషల్ మీడియా సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా రానున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి.. దీనిపై బిగ్ బాస్ నిర్వహకుల నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. బిగ్ బాస్ షోకు కూడా హోస్టుగా రానా వస్తే.. కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగలరు. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లను కూడా రానా ఎలా కంట్రోల్ చేస్తారనేది చూడాలి.