Bigg Boss Vishwa : బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చాడు.. బిఎం‌డబ్ల్యు కార్ కొన్నాడు

విశ్వ బిగ్ బాస్ కి వెళ్ళకముందు అనేక సీరియల్స్ లో ఆర్టిస్ట్ గా నటించాడు. హౌజ్‌లో ఉండి మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు విశ్వ. హౌస్ నుంచి బయటకి రాగానే తాజాగా బీఎండబ్ల్యూ కారును.....

Bigg Boss Vishwa : బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చాడు.. బిఎం‌డబ్ల్యు కార్ కొన్నాడు

Vishwa (1)

Bigg Boss Vishwa :  బిగ్ బాస్ కి వెళ్లొచ్చిన తర్వాత అంతా స్టార్ సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. అప్పటిదాకా చిన్న చిన్న సెలబ్రిటీలుగా ఉన్న వాళ్ళు బిగ్ బాస్ తో బాగా పేరు సంపాదిస్తున్నారు. పేరుతో పాటు డబ్బు కూడా బాగానే సంపాదిస్తున్నారు. బిగ్ బాస్ కి వెళ్లొచ్చినందుకు కూడా బాగానే డబ్బులు వస్తున్నాయి ఈ సెలబ్రిటీలకు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక ఆ స్టార్ డంతో బయట కూడా బాగానే సంపాదిస్తున్నారు. ఐతే ఇందులో చాలా మంది లైఫ్ లో సెట్ అవ్వడానికి ఆ ఇమేజ్ ని ఉపయోగించుకుంటున్నారు. చాలా మంది కంటెస్టెంస్ట్ బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక సొంత ఇళ్లు లేదా ఖ‌రీదైన కార్లు కొనుక్కుంటున్నారు.

KS Nageswararao : టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడి మృతి.. శోకసంద్రంలో శ్రీహరి కుటుంబం

గతంలో కూడా బిగ్ బాస్‌లో పాల్గొన్న హిమ‌జ, సోహెల్, అఖిల్‌, అరియానా, శివజ్యోతి, శ్రీముఖి లాంటి వాళ్ళు బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక కొత్త కార్లను కొన్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి ఈ సీజన్ కంటెస్టెంట్ విశ్వ కూడా చేరాడు. విశ్వ బిగ్ బాస్ కి వెళ్ళకముందు అనేక సీరియల్స్ లో ఆర్టిస్ట్ గా నటించాడు. హౌజ్‌లో ఉండి మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు విశ్వ. హౌస్ నుంచి బయటకి రాగానే తాజాగా బీఎండబ్ల్యూ కారును కొనేశాడు. లగ్జరీ కారును కొనేయడంతో అంతా షాక్ అవుతున్నారు.

Akhanda : మీరు మనిషేనా?.. బాలకృష్ణని అడిగిన ‘అఖండ’ హీరోయిన్

ఈ కారుతో ఫోటో దిగి, ఆ ఫోటోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి.. ‘మనం కలలు కన్న కారును కొంటే ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పలేం. ఇప్పుడు నేను అదే ఫీలింగ్‌లో ఉన్నాను. మా కుటుంబంలోకి కొత్త మెంబర్ వచ్చింది. దీనంతటికి కారణం ఆ దేవుడు, బిగ్ బాస్’ అంటూ విశ్వ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.