BiggBoss 6 Day 20 : “నీ ఆట తీరు చూసి మేము కూడా షాక్‌లో ఉన్నాం”.. నాగార్జున

బిగ్‌బాస్ సీజన్ 6 మూడోవారం కెప్టెన్ గా ఆదిరెడ్డి నిలిచాడు. ఇక బిగ్‌బాస్ నిర్వాహకులు నేటి ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు. గత వారంలో ఆట తీరు బాగోలేదంటూ సీరియస్ అయిన నాగార్జున, ఈ వారం కూడా అదే రీతిలో హౌస్ మేట్స్ కి వార్నింగ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

BiggBoss 6 Day 20 : “నీ ఆట తీరు చూసి మేము కూడా షాక్‌లో ఉన్నాం”.. నాగార్జున

BiggBoss 6 Day 20 : బిగ్‌బాస్ సీజన్ 6 మూడోవారం కెప్టెన్ గా ఆదిరెడ్డి నిలిచాడు. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్‌బాస్ ‘ఎత్తర జెండా’ అనే కెప్టెన్సీ టాస్క్ ఇవ్వగా, ఆ టాస్క్ లో ఆదిరెడ్డి సులువుగా గెలిచేసి బిగ్‌బాస్ కొత్త కెప్టెన్ గా భాద్యతలు తీసుకున్నాడు. ఆ తరువాత ఎపిసోడ్ మొత్తంలో ఎవరు ఎక్కువసేపు కనిపిస్తున్నారో చెప్పి కంటెస్టెంట్స్ యొక్క ఆట తీరు వాళ్లకి తెలిసేలా చేశాడు.

BiggBoss 6 Day 19 : కొత్త బిగ్‌బాస్ కెప్టెన్ ఎవరో తెలుసా.. మళ్ళీ గీతూ హడావిడి..

ఈ క్రమంలో గంటసేపు ప్రసారమయ్యే షోలో గీతూ రాయల్ అందరికంటే ఎక్కువసేపు కనిస్తుండగా, కీర్తి జీరో టైమింగ్ లో నిలిచింది. ఇక బిగ్‌బాస్ నిర్వాహకులు నేటి ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు. గత వారంలో ఆట తీరు బాగోలేదంటూ సీరియస్ అయిన నాగార్జున, ఈ వారం కూడా అదే రీతిలో హౌస్ మేట్స్ కి వార్నింగ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

ప్రోమో మొదటిలోనే.. నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని నిలబెట్టడం, అందులో ఉన్న శ్రీహాన్, శ్రీసత్య లను సేవ్ చేస్తూ కూర్చోబెట్టడం, సేవ్ అయ్యినందుకు వాళ్లకి క్లాప్స్ కొట్టారా అని అడిగిన నాగార్జున ప్రశ్నకు, బాలాజీ బదులిస్తూ.. మేము షాక్ లో ఉన్నాం సార్ అని చెప్పగా, అందుకు నాగార్జున కౌంటర్ ఇస్తూ.. “నీ ఆట తీరు చూసి మేము కూడా షాక్‌లో ఉన్నాం” అని చెప్పడమే కాకుండా, దొంగ-పోలీస్ టాస్క్ లో కంటెస్టెంట్ బాలాజీ ఆట తీరు బాగోలేదంటూ వీడియో వేసి మారి చూపించాడు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.