BiggBoss 6 Day 45 : బిగ్‌బాస్‌లో దొంగలు పడ్డారు.. బిగ్‌బాస్ కోపానికి ఆకలితో అలమటించిన కంటెస్టెంట్స్

మంగళవారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ మీద బిగ్‌బాస్‌ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. కంటెస్టెంట్స్ టాస్కులు సరిగ్గా చేయట్లేదని, ఎవరూ సీరియస్ గా ఆడట్లేదని బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్ మీద బాగా సీరియస్ అయ్యాడు. ఇష్టం లేకపోతే ఇంట్లోంచి కూడా వెళ్లిపోండి అని అనడంతో...............

BiggBoss 6 Day 45 :  మంగళవారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ మీద బిగ్‌బాస్‌ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. కంటెస్టెంట్స్ టాస్కులు సరిగ్గా చేయట్లేదని, ఎవరూ సీరియస్ గా ఆడట్లేదని బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్ మీద బాగా సీరియస్ అయ్యాడు. ఇష్టం లేకపోతే ఇంట్లోంచి కూడా వెళ్లిపోండి అని అనడంతో కంటెస్టెంట్స్ బిగ్‌బాస్‌ ని బతిమాలుకున్నారు. అయితే బిగ్‌బాస్‌ వీళ్ళని శిక్షించాలని హౌజ్ లోకి దొంగల్ని పంపించాడు. కొంతమంది ముసుగు వేసుకొని వచ్చి ఇంట్లో అన్ని చోట్ల ఉన్న ఫుడ్ తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టేశారు. కంటెస్టెంట్స్ ఎవరైనా ఫుడ్ దాచుకుంటే అది కూడా తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టేయమనడంతో కొంతమంది కంటెస్టెంట్స్ దాచుకున్న ఫుడ్ ని తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టేశారు.

దీంతో కంటెస్టెంట్స్ ఆకలికి అలమటించిపోయారు. కొంతమంది ఓపిక లేక నడవలేక అక్కడే పడుకున్నారు. ఇక కంటెస్టెంట్స్ అంతా కూర్చొని ఏం చేయాలా అని మాట్లాడుకుంటుండగా బిగ్‌బాస్‌ వాళ్ళకి ఫుడ్ కావాలంటే చెప్పిన టాస్కులు చేయాలి అని చెప్పాడు. కంటెస్టెంట్స్ ని రెండు టీంలుగా విడగొట్టాడు. మొదట అన్నం, పప్పు హౌజ్ లోకి పంపించి అది గెలుచుకోవాలంటే కబడ్డీ ఆడాలి, కబడ్డీ ఆడిన టీంకి ఆ ఫుడ్ లభిస్తుంది అని చెప్పారు. దీంతో కంటెస్టెంట్స్ అంతా కబడ్డీ ఆడగా గెలిచిన టీం ఫుడ్ ని తీసుకుంది.

BiggBoss 6 Day 44 : ఇష్టం లేకపోతే హౌజ్ నుంచి వెళ్లిపోండి.. కంటెస్టెంట్స్ మీద సీరియస్ అయిన బిగ్‌బాస్

గెలుచుకున్న ఫుడ్ ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోకుండా తినాలి అని బిగ్‌బాస్‌ చెప్పాడు. ఆ తర్వాత మరో టాస్క్ లో చపాతీలు, కూర పంపించి బాల్స్ తో టగ్ ఆఫ్ వార్ గేమ్ ఆడించాడు. ఈ సారి కూడా రెండు టీమ్స్ లాగే ఆడారు. మరో టీం చపాతీలని గెలుచుకుంది. అయితే బిగ్‌బాస్‌ చెప్పిన ఫుడ్ షేర్ చేసుకోకూడదు అనే రూల్ ని బ్రేక్ చేసి ఆదిరెడ్డి వేరే టీంలో ఉన్న గీతూకి చపాతీ షేర్ చేశాడు. దీంతో బిగ్‌బాస్‌ వాళ్ళకి పనిషమెంట్ ఇచ్చాడు. హౌజ్ లో ఉన్న గిన్నెలు, కళాయిలు తోమమని చెప్పడంతో ఆదిరెడ్డి, గీతూ కలిసి వాటిని తోమారు.

ట్రెండింగ్ వార్తలు