BiggBoss 6 Day 92 : బిగ్‌బాస్ విన్నర్ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా??
ఇక బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ ముందుగా 50 లక్షలు అని ఎప్పుడో ప్రకటించారు. కానీ కంటెస్టెంట్స్ కి రకరకాల టాస్కులు ఇచ్చి అందులో ఓడిపోతే బిగ్‌బాస్ ప్రైజ్‌మనీలో అమౌంట్ తగ్గుతుందని చెప్పి గత రెండు వారాలుగా బిగ్‌బాస్ ప్రైజ్‌మనీలో..................

BiggBoss 6 Day 92 : బిగ్‌బాస్ సీజన్ 6 దాదాపు చివరికి వచ్చేసింది. ఇప్పటికే 13 వారాలు పూర్తికాగా ప్రస్తుతం 14వ వారం నడుస్తుంది. 21 సభ్యులతో మొదలైన బిగ్‌బాస్ లో ఇప్పటికే 13 మంది ఎలిమినేట్ అయిపోగా ప్రస్తుతం 7 గురు మాత్రమే మిగిలే ఉన్నారు. శ్రీహన్, రేవంత్, రోహిత్, శ్రీసత్య, కీర్తి, ఆదిరెడ్డి, ఇనయాలు ప్రస్తుతం హౌజ్ లో ఉన్నారు. మరి ఈ ఏడుగురిలో బిగ్‌బాస్ ఫైనల్ లో నిలిచే అయిదుగురు ఎవరో చూడాలి.
ఇక బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ ముందుగా 50 లక్షలు అని ఎప్పుడో ప్రకటించారు. కానీ కంటెస్టెంట్స్ కి రకరకాల టాస్కులు ఇచ్చి అందులో ఓడిపోతే బిగ్‌బాస్ ప్రైజ్‌మనీలో అమౌంట్ తగ్గుతుందని చెప్పి గత రెండు వారాలుగా బిగ్‌బాస్ ప్రైజ్‌మనీలో అమౌంట్ ని తగ్గించుకుంటూ వస్తున్నాడు బిగ్‌బాస్. ఇక ఈ వారంలో చివరి రెండు రోజులు మరిన్ని టాస్కులు ఇచ్చి ఈ టాస్కులు చేస్తే బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ పెరుగుతుందని చెప్పి రకరకాల, వింత వింత టాస్కులన్నీ ఇచ్చాడు బిగ్‌బాస్.
కంటెస్టెంట్స్ అంతా బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ ఎక్కువే ఉండాలని కస్టపడి టాస్కులు చేశారు. చివరగా నష్టపోయిన మనీ, మళ్ళీ గెలిచినా మనీ అంతా లేఖలు వేసి విన్నర్ కి బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ 47 లక్షలకు చేరింది అని ఈ ఎపిసోడ్ లో ప్రకటించారు. మొత్తంగా చూసుకుంటే 3 లక్షలు లాస్ వచ్చినట్టే. అయితే ఈ బిగ్‌బాస్ ప్రైజ్‌మనీతో పాటు 25 లక్షల విలువ చేసే ఒక ల్యాండ్ కూడా ఇస్తారని గతంలోనే ప్రకటించాడు నాగార్జున. మరి ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ లో ఈ 47 లక్షల బిగ్‌బాస్ ప్రైజ్‌మనీతో పాటు ల్యాండ్ ఎవరు గెలుచుకుంటారో చూడాలి.