BiggBoss 6 Finale : బిగ్‌బాస్ సీజన్ 6 విన్నర్ రేవంత్.. కానీ ప్రేక్షకులు శ్రీహన్ కి ఓట్లేశారన్న నాగ్..

 బిగ్‌బాస్ సీజన్ 6 ఘనంగా మొదలై 21 మంది కంటెస్టెంట్స్ తో 14 వారాలు సాగి మధ్యలో కొంచెం చప్పగా అనిపించినా చివర్లో మళ్ళీ ఆట మీద ఆసక్తి పెంచారు. ఇక బిగ్‌బాస్ ఫినాలే చాలా గ్రాండ్ గా జరిగింది. అన్ని వారాలు నామినేషన్స్ నుంచి తప్పించుకుంటూ టాప్ 5లో కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్, శ్రీహన్, రేవంత్ లు నిలిచారు. ఇక గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో..............

BiggBoss 6 Finale : బిగ్‌బాస్ సీజన్ 6 విన్నర్ రేవంత్.. కానీ ప్రేక్షకులు శ్రీహన్ కి ఓట్లేశారన్న నాగ్..

BiggBoss 6 Finale :  బిగ్‌బాస్ సీజన్ 6 ఘనంగా మొదలై 21 మంది కంటెస్టెంట్స్ తో 14 వారాలు సాగి మధ్యలో కొంచెం చప్పగా అనిపించినా చివర్లో మళ్ళీ ఆట మీద ఆసక్తి పెంచారు. ఇక బిగ్‌బాస్ ఫినాలే చాలా గ్రాండ్ గా జరిగింది. అన్ని వారాలు నామినేషన్స్ నుంచి తప్పించుకుంటూ టాప్ 5లో కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్, శ్రీహన్, రేవంత్ లు నిలిచారు. ఇక గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చారు.

బిగ్‌బాస్ ఫినాలే ఎపిసోడ్ కి మొదటిసారి రవితేజ వచ్చారు. రవితేజతో పాటు శ్రీలీల కూడా వచ్చి ధమాకా సినిమా ప్రమోషన్స్ తో పాటు కాసేపు కంటెస్టెంట్స్ తో ఎంటర్టైన్ చేశారు. అనంతరం హీరో నిఖిల్ కూడా వచ్చాడు. పలువురు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో మెప్పించారు. గత సీజన్ కంటెస్టెంట్స్ కూడా వచ్చి అలరించారు.

చివర్లో శ్రీహాన్, కీర్తి, రేవంత్ లు ఉండగా ఒకర్ని పంపించడానికి డబ్బులున్న సూట్ కేసుని పంపగా 30 లక్షలు ఆఫర్ చేశాడు బిగ్‌బాస్ కానీ ఎవరూ తీసుకోకపోవడంతో కీర్తిని బయటకి పంపించేశాడు. అనంతరం ఫైనల్ కి శ్రీహాన్, రేవంత్ ఇద్దరే మిగిలి ఉండగా మరోసారి టెన్షన్ పెట్టకుండా మనీ ఆఫర్ చేశాడు నాగార్జున. విన్నర్ మనీ నుంచి 10 లక్షలతో మొదలుపెట్టి చివరికి 40 లక్షల వరకు తీసుకెళ్లాడు నాగ్. దీంతో ఇంట్లో వాళ్ళ కోసం అంటూ శ్రీహాన్ డబ్బులు తీసుకొని రన్నరప్ అని ఒప్పేసుకున్నాడు.

FIFA World Cup 2022 : ఫిఫా వరల్డ్‌కప్ విజేత అర్జెంటీనా, ఫైనల్లో ఫ్రాన్స్‌పై గెలుపు, 36ఏళ్ల తర్వాత టైటిల్

ఇక మిగిలింది రేవంత్ కావడంతో అతన్ని విన్నర్ గా ప్రకటించి బిగ్‌బాస్ కప్ అందించాడు నాగార్జున. అయితే కప్ ఇచ్చిన తర్వాత శ్రీహాన్ ఆ డబ్బులు తీసుకోకపోతే విన్నర్ అయ్యేవాడని, ప్రేక్షకుల ఓట్లు ఎక్కువగా శ్రీహాన్ కే పడ్డాయని నాగార్జున చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కానీ శ్రీహాన్ డబ్బులు తీసుకోవడంతో రేవంత్ విన్ అయ్యాడు. అయితే అసలైన విజేత శ్రీహాన్ అని అభిమానులు, నెటిజన్లు సందడి చేస్తున్నారు. దీంతో బిగ్‌బాస్ సీజన్ 6 అంకం ముగిసింది.