BiggBoss 6 : బిగ్‌‌బాస్‌ సీజన్‌-6 నుంచి మొదటిగా ఎలిమినేట్ అయ్యేది అతడేనట?

బిగ్‌‌బాస్‌ సీజన్‌-6 మొదలై అప్పుడే రెండువారాలు ముగించుకుంది. మూడో వారానికి చేరుకోబోతున కంటెస్టెంట్స్, నిన్నటి ఎపిసోడ్ ని నవ్వుతు, నవ్విస్తూ ముగించారు. ఇక బిగ్‌‌బాస్‌ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మొదటివారం ఎలిమినేషన్ తీసేసిన సంగతి తెలిసిందే. అయితే రెండో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది చాలా ఉతకంఠగా ఉంది.

BiggBoss 6 : బిగ్‌‌బాస్‌ సీజన్‌-6 నుంచి మొదటిగా ఎలిమినేట్ అయ్యేది అతడేనట?

BiggBoss 6 First Elimination

BiggBoss 6 : బిగ్‌‌బాస్‌ సీజన్‌-6 మొదలై అప్పుడే రెండువారాలు ముగించుకుంది. మూడో వారానికి చేరుకోబోతున కంటెస్టెంట్స్, నిన్నటి ఎపిసోడ్ ని నవ్వుతు, నవ్విస్తూ ముగించారు. ముందుగా నిన్న కెప్టెన్సీ ఎన్నిక ఉండటంతో కంటెస్టెంట్స్ మూడోవారంకు గాను రాజశేఖర్ ని కెప్టెన్ గా ఎన్నుకున్నారు. ఆ తరువాత బిగ్‌‌బాస్‌ హౌస్ లోకి `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` ప్రమోషన్స్ లో భాగంగా సుధీర్‌బాబు, కృతిశెట్టి వచ్చి కంటెస్టెంట్స్ తో కలిసి సందడి చేశారు.

BiggBoss 6: బిగ్‌బాస్ సీజన్ 6.. రెండోవారం నామినేషన్స్ లో నిలవనుంది ఎవరు?

ఇక బిగ్‌‌బాస్‌ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మొదటివారం ఎలిమినేషన్ తీసేసిన సంగతి తెలిసిందే. అయితే రెండో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది చాలా ఉతకంఠగా ఉంది. ఈ వారం ఎలిమినేషన్స్ కి రాజ్, షాని, అభినయ, రోహిత్ -మెరీనా, ఆది రెడ్డి, గీతూ, రేవంత్, ఫైమా నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు బయటకి వస్తారో అన్న విషయంపై ఆడియన్స్ ఎవరి ఊహాగానాలు వాళ్ళు వెల్లడిస్తున్నారు.

అయితే ఈ వారం బిగ్‌‌బాస్‌ నుంచి బయటకి రాబోతున్నది..”షాని సోలమన్” అని తెలుస్తుంది. బిగ్ బాస్ సన్నిహిత వర్గాల నుండి వచ్చిన తాజా నివేదికల ప్రకారం, రెండవ వారంలో బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన మొదటి వ్యక్తి షాని సోలమన్ అని వినిపిస్తుంది. ‘సై’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు షాని పెర్ఫార్మన్స్ బిగ్‌‌బాస్‌ లో చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. మరి చూడాలి బయటకి వచ్చేది షాని? లేక ఇంకొకరా?