BiggBoss 6 Sri Satya: బిగ్‌బాస్ కంటెస్టెంట్ శ్రీసత్య గురించి మీకు తెలుసా..
బిగ్‌బాస్ సీజన్ 6 ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా మొదలయింది. ఈ సీజన్‌లో ఆరవ కంటెస్టెంట్‌గా మిస్ విజయవాడ శ్రీసత్య మంగళంపల్లి ఎంట్రీ ఇచ్చింది. విజయవాడలో పుట్టి పెరిగిన శ్రీసత్య MBBS చదువుకుంది. మోడలింగ్ అండ్ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో 2015...

BiggBoss 6 Sri Satya: బిగ్‌బాస్ సీజన్ 6 ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా మొదలయింది. “ఈ ఫీల్డ్ లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే అది నా తరవాతే” అంటూ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున. ఆ తర్వాత బంగార్రాజు టైటిల్ సాంగ్‌కి మోడల్స్‌తో కలిసి స్టెప్పులేశారు. మనకి రుచులు ఆరు, రుతువులు ఆరు, ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్ కూడా ఆరు అందుకే ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్ బిగ్‌బాస్ 6 అని షో గురించి చెప్పుకొచ్చాడు నాగార్జున. ఆ తర్వాత తనే హౌస్‌లోకి వెళ్లి హౌస్ మొత్తాన్ని చూపించారు. ఈసారి బిగ్ బాస్ ఇల్లు గత సీజన్లలో కంటే కూడా మరింత రిచ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్స్ ని స్టేజి మీదకి పిలిచాడు.
BiggBoss 6 Neha Chowdary: బిగ్‌బాస్ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి మీకు తెలుసా..
ఈ సీజన్‌లో ఆరవ కంటెస్టెంట్‌గా మిస్ విజయవాడ శ్రీసత్య మంగళంపల్లి ఎంట్రీ ఇచ్చింది. విజయవాడలో పుట్టి పెరిగిన శ్రీసత్య MBBS చదువుకుంది. మోడలింగ్ అండ్ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో 2015 మిస్ విజయవాడ పోటీలో పాల్గొని టైటిల్ కూడా అందుకుంది. ఆ తరువాత 2016 నేను శైలజ చిత్రంలో హీరో రామ్‌కి గర్ల్‌ఫ్రెండ్‌గా ఒక చిన్నపాత్రలో కనిపించింది. 2018లో టెలివిజన్ కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీసత్య ముద్దమందారం ,త్రినయని, నిన్నే పెళ్ళాడతా, అత్తారింట్లో అక్కా చెల్లెల్లు వంటి సీరియల్స్ లో నటించింది.
ఇవేకాకుండా లవ్ స్కెచ్, తరుణం, అంత భ్రాంతియేనా, తొందరపడకు సుందర వదన వంటి పలు షార్ట్ ఫిలిమ్స్ మరియు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్-6కు ఎంట్రీ ఇచ్చిన శ్రీసత్య బిగ్‌బాస్ హౌస్ లో ఎంతవరకు రాణించగలదో చూడాలి.