Inaya Sultana : హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ.. నటరత్నాలు!

RGV భామగా బిగ్‌బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇనయ సుల్తానా ఏకంగా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.

Inaya Sultana : హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ.. నటరత్నాలు!

BiggBoss Beauty Inaya Sultana got heroine chance in Nataratnalu

Inaya Sultana : బిగ్‌బాస్ (BiggBoss) షోలో కనిపించి చాలా మంది ఫేమ్ అండ్ సెలబ్రెటీ హోదాని అందుకుంటున్నారు. ఈ రియాలిటీ షోలో కనిపించిన తరువాత బుల్లితెర నుంచి వెండితెర వరకు ఆఫర్లు అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే దివి (Divi Vadthya), వి జె సన్నీ, సోహెల్ వంటి తారలు క్రేజీ ఆఫర్లు అందుకుంటూ వస్తున్నారు. తాజాగా ఇనయ సుల్తానా ఏకంగా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. బిగ్‌బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.

Takkar Teaser : దివ్యాంశ కౌశిక్‌‌తో సిద్దార్థ్ రొమాన్స్ మాములుగా లేదుగా..

ఇనయ పలు తెలుగు సినిమాల్లో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తో కలిసి ఈ భామ ఒక డాన్స్ చేయగా అది కాస్త బయటకి వచ్చి బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో తెచ్చిన ఫేమ్ తో బిగ్‌బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక బిగ్‌బాస్ ఇంటిలో తన అట తీరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులను సంపాదించుకుంది. తాజాగా హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది.

Das Ka Dhamki : దాస్‌తో ప్రెస్ మీట్ లో సందడి చేసిన నివేత పేతురేజ్..

నటరత్నాలు అనే సినిమాలో ఇనయ హీరోయిన్ గా కనిపించబోతుంది. ఆల్రెడీ షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రాన్ని నర్రా శివనాగు డైరెక్ట్ చేస్తున్నాడు. ఎవరెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమాని చందన ప్రొడక్షన్స్‌ పతాకంపై డా దివ్య నిర్మిస్తుంది. రంగస్థలం మహేష్‌, సుదర్శన్‌, అర్జున్‌ తేజ్‌ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయస్తామంటూ మేకర్స్ వెల్లడించారు.