Neha Chowdary : పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్.. వెంటనే ఫైనల్ ఎపిసోడ్ కి..
బిగ్‌బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ‘నేహా చౌదరి’ యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకి పరిచయం. ముఖ్యంగా స్పోర్ట్స్ యాంకరింగ్ తో యూత్ కి బాగా దగ్గరైంది. కానీ అంతకుముందే నేహా రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో నేషనల్ ఛాంపియన్ గా..............

Neha Chowdary : బిగ్‌బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ‘నేహా చౌదరి’ యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకి పరిచయం. ముఖ్యంగా స్పోర్ట్స్ యాంకరింగ్ తో యూత్ కి బాగా దగ్గరైంది. కానీ అంతకుముందే నేహా రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో నేషనల్ ఛాంపియన్ గా గోల్డ్ మెడల్స్ కూడా అందుకుంది. ఒకపక్క జిమ్నాస్టిక్స్ చేస్తూనే మరోపక్క యాంకరింగ్ తో బిజీగా ఉన్న నేహా బిగ్‌బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్స్ గా వచ్చి త్వరగానే వెళ్ళిపోయింది.
బిగ్‌బాస్ లో నాగార్జున పెళ్లి గురించి అడిగితే.. బిగ్‌బాస్ షోకి వెళ్లొచ్చాక పెళ్లి చేసుకుంటా అని ఇంట్లో వాళ్లకి చెప్పను అంది నేహా. చెప్పినట్టే షో నుంచి బయటకి రాగానే తన పెళ్లి గురించి ప్రకటించి తాను చదువుకునేటప్పుడు తన క్లాస్మెట్ అనిల్ నే పెళ్లి చేసుకోబోతున్నాను అని తెలిపింది.
Raghavendrarao : నేను తీసిన సినిమాలో ఆర్కెస్ట్రా గ్రూపులో వచ్చి డ్రమ్స్ వాయించాడు రవితేజ..
డిసెంబర్ 17న నేహా చౌదరి పెళ్లి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య ఘనంగానే జరిగింది. ఇక డిసెంబర్ 18న బిగ్‌బాస్ ఫైనల్ ఎపిసోడ్ జరిగింది. ఫైనల్ ఎపిసోడ్ కి సీజన్ లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ అంతా ఉండాల్సిందే. దీంతో పెళ్లి అయిపోగానే అటునుంచి బిగ్‌బాస్ ఫినాలే ఎపిసోడ్ కి వచ్చి అందరి ఆశ్చర్యపరిచింది నేహా చౌదరి. ఇక సీజన్ 6 బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అంతా కూడా నేహా పెళ్ళికి వచ్చి సందడి చేశారు. వీరంతా కలిసి దిగిన గ్రూప్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.