Bigg Boss 5 : కంటెస్టెంట్స్ భవిష్యత్తు బొమ్మల్లో పెట్టిన నాగార్జున

వీక్ నామినేషన్స్ లో ఎవరు ఉన్నారు అని నాగార్జున అడగ్గా నామినేషన్స్ లో ఉన్న వారు లేచి నించున్నారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ కొంతమంది వెళ్లి బొమ్మలని తీసుకొచ్చారు. ఆ బొమ్మల్ని

10TV Telugu News

Bigg Boss 5 :  నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ చాలా సీరియస్ గా సాగింది. నాగార్జున కంటెస్టెంట్స్ అందరిపైనా సీరియస్ అయ్యాడు. శ్వేతా వర్మ ఎలిమినేట్ అయిపోయినట్టు తెలుస్తుంది. లోబో సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు. ఇలా నిన్నటి ఎపిసోడ్ అంతా సీరియస్ గా సాగిపోయింది. ఇవాళ ఆదివారం కావడంతో సీరియస్ ని పక్కన పెట్టి ఫన్ ఇస్తాను అని నాగార్జున చెప్పాడు.

ఇవాళ నైట్ రాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఎప్పటిలాగే వీకెండ్ ఎపిసోడ్ అంటే డ్యాన్స్ వేస్తూ ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. ఇక కంటెస్టెంట్స్ తో డ్యాన్సులు చేపించాడు. కంటెస్టెంట్స్ అంతా డ్యాన్స్ చేశారు. కంటెస్టెంట్స్ తో గేమ్స్ కూడా ఆడించాడు. తర్వాత మల్లి సీరియస్ అయ్యాడు.

Pooja Hegde : పూజా హెగ్డే ఫేవరేట్ ఫుడ్.. ఫేవరేట్ డ్రెస్.. ఇవేనా??

కంటెస్టెంట్స్ ఒక్కొక్కరికి ఒక్కో కుండ ఇచ్చారు. ఆ కుండని నాగార్జున ముందు పగలగొట్టారు. అందులో కొంతమందికి నాణేలు రాగా కొంతమందికి టోకెన్లు వచ్చాయి. ఈ వీక్ నామినేషన్స్ లో ఎవరు ఉన్నారు అని నాగార్జున అడగ్గా నామినేషన్స్ లో ఉన్న వారు లేచి నించున్నారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ కొంతమంది వెళ్లి బొమ్మలని తీసుకొచ్చారు. ఆ బొమ్మల్ని ఒక్కొక్కరికి ఒక్కో బొమ్మ ఇచ్చారు. ఈ బొమ్మల్లోనే మీ భవిష్యత్తు ఉంది అని నాగార్జున చెప్పే సరికి అందరు ఆశ్చర్యపోయారు. దాని లోపల ఎవరి ఫోటో ఉంటే వాళ్లే ఎలిమినేట్ అవుతారు అని నాగార్జున చెప్పేసరికి అందరు ఆశ్చర్యపోయారు. ఇప్పటికే శ్వేతా వర్మ ఎలిమినేట్ అయిపోయిందని తెలుస్తుంది. మరి శ్వేతనే పంపిస్తారా లేదా శ్వేతా తో పాటు ఇంకెవరినైనా పంపిస్తారా చూడాలి అంటే ఇవాళ నైట్ ఎపిసోడ్ లో చూడాలి.