HImaja : రెంట్ హౌస్‌ని కూడా హోమ్ టూర్ చేసిన నటి

తాజాగా ఓ నటి ఏకంగా రెంట్ హౌస్ ని కూడా హోమ్ టూర్ చేసి వీడియో పెట్టింది. బిగ్‌బాస్‌ ఫేం, నటి హిమజ తన కొత్త ఇంటికి సంబంధించిన వీడియోను షేర్‌ చేసింది. అయితే ఈ వీడియో మొదట్లోనే...............

HImaja : రెంట్ హౌస్‌ని కూడా హోమ్ టూర్ చేసిన నటి

Himaja

HImaja :  ఇటీవల సెలబ్రిటీలంతా యూట్యూబ్ ఛానల్స్ తో ప్రేక్షకులకి మరింత దగ్గరవుతున్న సంగతి తెలిసిందే. వారి వ్యక్తిగత విషయాలు, వారికి సంబంధించిన వస్తువుల గురించే కూడా చూపిస్తూ వీడియోలు చేస్తున్నారు. వీటిల్లో ముఖ్యంగా హోమ్ టూర్ ఒకటి. ప్రతి సెలబ్రిటీ ఇటీవల హోమ్ టూర్స్ చేస్తున్నాడు. జనాలకి కూడా సెలబ్రిటీల ఇళ్లు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని ఆత్రుత ఎక్కువగా ఉండటంతో ఈ హోమ్ టూర్ వీడియోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. చాలా మంది వారి సొంత ఇళ్ళని హోమ్ టూర్ చేసి వీడియోలు తమ ఛానల్స్ లో పెడుతున్నారు.

కానీ తాజాగా ఓ నటి ఏకంగా రెంట్ హౌస్ ని కూడా హోమ్ టూర్ చేసి వీడియో పెట్టింది. బిగ్‌బాస్‌ ఫేం, నటి హిమజ తన కొత్త ఇంటికి సంబంధించిన వీడియోను షేర్‌ చేసింది. అయితే ఈ వీడియో మొదట్లోనే.. ఇది తన సొంత ఇల్లు కాదని, ఇటీవలే ఈ ఇంటికి రెంట్‌కు వచ్చానని తెలిపింది. ప్రస్తుతం తాను ఉంటున్న ఇంటిని రెనోవేట్‌ చేయించి అమ్మేద్దామనుకుంటున్నందుకు ఈ రెంట్ హౌస్ కి షిఫ్ట్ అయ్యానని తెలిపింది. అలాగే తన డ్రీమ్‌ హౌజ్‌ను నిర్మించుకుంటున్నానంటూ గతంలో ఓ వీడియో కూడా పెట్టింది. ఆ ఇల్లు పూర్తి అయ్యేంతవరకు ఇక్కడ రెంట్ హౌస్ లో ఉండబోతున్నాని తెలిపింది.

Manchu Lakshmi : తెలంగాణాలో 50 స్కూళ్లని దత్తత తీసుకున్న మంచు లక్ష్మి

ఇక ఈ వీడియోలో తన రెంట్ హౌస్ లో తన పెంపుడు కుక్కల్ని, లివింగ్ రూమ్ ని, ఇంట్లో ఉన్న డెకరేట్ సామాన్లని, బెడ్ రూమ్, సోఫా సెట్స్, తన మేకప్ కిట్స్, బాల్కనీ, టీవీ, కిచెన్, డైనింగ్ టేబుల్, స్టోర్ రూమ్.. ఇలా ఈ ఇంట్లో ఉన్నవి కూడా అన్ని చూపించింది. త్వరలో కొత్త ఇల్లు పూర్తయ్యాక మళ్ళీ దాని వీడియో కూడా చేస్తా అని చెప్పింది హిమజ.