BiggBoss : ఇదేందిరా బై.. తొక్కలో ఆట… ఏం పీకుతున్నారు.. బిగ్ బాస్‌లో మంటలు

రేపటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో బిగ్ బాస్ కాటన్ ఇవ్వడంతో ఆ కాటన్ కోసం అందరూ పరిగెత్తారు. ఒకర్నొకరు తోసుకున్నారు. సన్నీకి కోపం వచ్చి ఇదేందిరా బై.. తొక్కలో ఆట నేను ఆడను

BiggBoss : ఇదేందిరా బై.. తొక్కలో ఆట… ఏం పీకుతున్నారు.. బిగ్ బాస్‌లో మంటలు

Bb

BiggBoss :  బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రోజు రోజుకి మరింత ఆసక్తికరంగా మారుతుంది. గొడవలు, కొట్టుకోవడాలు, లవ్ ట్రాక్స్ తో హాట్ హాట్ గా సాగిపోతుంది ఈ సీజన్. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో అందరూ గొడవ పడటమే కనిపిస్తుంది. కెప్టెన్సీ కండెన్స్ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ రోజుకొక కొత్త టాస్క్ ని కంటెస్టెంట్స్ కి ఇస్తున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్స్ ని నాలుగు గ్రూపులుగా విడగొట్టారు. దీంతో ఆ గ్రూపుల మధ్య వైరం బాగా పెరిగింది.

రేపటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో బిగ్ బాస్ కాటన్ ఇవ్వడంతో ఆ కాటన్ కోసం అందరూ పరిగెత్తారు. ఒకర్నొకరు తోసుకున్నారు. సన్నీకి కోపం వచ్చి ఇదేందిరా బై.. తొక్కలో ఆట నేను ఆడను అని సీరియస్ అయ్యాడు. వాళ్ళకో రూల్ మనకో రూలా అని అరిచాడు. వెంటనే సిరి ఎందుకు అలా అరుస్తాడు అంటూ సీరియస్ అయింది. సిరి సన్నీని అందరి ముందు సారీ చెప్పమని అడిగింది. సన్నీ సీరియస్ గా నేను సారీ చెప్పను ఏం చేసుకుంటావో చేస్కో అని అన్నాడు.

Avika Gor : నిర్మాతగా మారిన చిన్నారి పెళ్లికూతురు

కాజల్ మధ్యలో కలగచేసుకొని రూల్స్ బ్రేక్ చేశారు. బ్రేక్ చేసిన రెండు టీమ్స్ లో వాళ్ళు వచ్చి ముందు నిల్చోవాలి అంటే ప్రియా మేము ఒప్పుకోము అంటే సిరి ఇదే ఫైనల్ అనడంతో ప్రియకి కోపం వచ్చింది. సన్నీ మళ్ళీ సీరియస్ అయి రోజుకొక రూల్ ఎలా మారుస్తారు అని అరిచాడు. నిన్న రూల్స్ బ్రేక్ చేస్తే అప్పుడు ఏం పీకుతున్నారు అని ప్రియా అరిచింది. కాజల్ మధ్యలో కలగచేసుకొని మా ఇష్టం వచ్చినట్టు మేముంటాం అంటే ప్రియా సరే ఇదే మాట మీద ఉండు అని సీరియస్ అయి వెళ్ళిపోయింది. సన్నీ మధ్యలో కామెడీగా సాంగ్ పాడాడు మానస్ తో కలిసి వేరే టీం వాళ్ళని ఇంకా సీరియస్ చేయడానికి.

Freida pinto : ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ హీరోయిన్ కి బేబీ షవర్‌ ఫంక్షన్‌

సిరి బాధపడి వెళ్లి షన్నుని గట్టిగా హాగ్ చేసుకుంది. షన్ను సిరిని కాసేపు ఓదార్చి నిన్ను ఓదార్చాలో నేను బాధపడాలో అర్ధం కావట్లేదు అంటూ డల్ అయిపోయాడు. ఇక ప్రియా లాస్ట్ కి నాకు స్పెషల్ పవర్ ఇస్తే గేమ్ తిప్పుతా అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇలా కంటెస్టెంట్స్ అందరి మధ్యలో గొడవలతో సాగిపోతుంది ప్రస్తుతం బిగ్ బాస్.