Bigg Boss 5 : ఈ సారి నామినేషన్స్‌లో వీళ్లేనా??

ఈ సారి నామినేష‌న్స్ బాధ్య‌త‌ను హంట‌ర్స్ వేషం వేపించి జెస్సీ, శ్రీరామ్‌, స‌న్నీకి అప్ప‌గించాడు బిగ్ బాస్. దీంతో గేమ్‌లో హడావిడి చేశారు ఈ హంటర్స్. ఇక సన్నీ అయితే బాగా ఓవర్ కూడా

Bigg Boss 5 : ఈ సారి నామినేషన్స్‌లో వీళ్లేనా??

Bb 5

Bigg Boss 5 :  ఈ సారి బిగ్ బాస్ సీజన్ 5 ఎక్కువగా గొడవలతోనే సాగిపోతుంది. మొన్న ఆదివారం ఒక్కరోజు హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ ఉంది అనుకుంటే తర్వాతి ఎపిసోడ్ నుంచి మళ్ళీ మామూలే అయింది. ఒకరి పై ఒకరు గొడవ పడటంతోనే బిగ్ బాస్ సాగిపోతుంది. గత వారం శ్వేతా ఎలిమినేట్ అయింది. ఇక ఈ వారానికి ఎలిమినేషన్స్ ప్రక్రియని కొంచెం కొత్తగా పెట్టారు. ఈ ఎలిమినేషన్స్ తో మళ్ళీ అందరి మధ్య విబేధాలు తలెత్తాయి.

ఈ సారి నామినేష‌న్స్ బాధ్య‌త‌ను హంట‌ర్స్ వేషం వేపించి జెస్సీ, శ్రీరామ్‌, స‌న్నీకి అప్ప‌గించాడు బిగ్ బాస్. దీంతో గేమ్‌లో హడావిడి చేశారు ఈ హంటర్స్. ఇక సన్నీ అయితే బాగా ఓవర్ కూడా చేసినట్టు అనిపించింది. ఈ సారి నామినేష‌న్స్‌లో ప్రియ మ‌రోసారి సిల్లీ రీజ‌న్‌తో ర‌విని నామినేట్ చేసింది. సోఫా మీద ట‌వ‌ల్ ఆరేయ‌డం న‌చ్చ‌లేద‌ని చెప్పి రవిని నామినేట్ చేసింది. దీంతో రవి షాక్ అయ్యాడు. ఇక ఈ నామినేషన్స్ టాస్క్ లో స‌న్నీ, ప్రియాంక ల మధ్య పెద్ద గొడవే జరిగింది. సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఫేక్ జ‌నాల‌తో నేనుండ‌లేను అంటూ ప్రియాంక సీరియస్ అయింది.

Akhil : అయ్యగారి ఫ్యాన్ ని కలుస్తా అంటున్న అఖిల్

ఇక స‌న్నీ.. ర‌వితో గొడవ పెట్టుకోవడంతో ఆరు వారాల నుంచి నామినేట్ అవుతున్నాన‌ని, ఈసారికి వ‌దిలేయ‌మ‌ని స‌న్నీని వేడుకున్నాడు ర‌వి. అయినా శ్వేత ఉంటే నిన్ను క‌చ్చితంగా నామినేట్ చేసేద‌ని ర‌వికి చెప్పి రవిని నామినేట్ చేశాడు. రవి షాక్ అయి శ్వేత నావ‌ల్ల వెళ్లిపోయిందా? అని అడిగాడు. ఇంతలో శ్వేత గురించి మాట్లాడొద్దంటూ స‌న్నీకి వార్నింగ్ ఇచ్చింది యానీ మాస్టర్. దీంతో స‌న్నీ సీరియస్ అయి గేమ్ మీరాడొద్దు, నేనాడుతా ఇప్పట్నించీ, నామినేష‌న్స్ అంటే మ‌జాక్ అయితుందా అని ఫైర్ అయ్యాడు.

Anasuya: కోట శ్రీనివాసరావుపై అనసూయ ఆగ్రహం.. వారిని ప్రశ్నించరా?

ఇక సిరి.. మాన‌స్‌ను, ష‌ణ్ముఖ్‌.. యానీ మాస్ట‌ర్‌ను, కాజ‌ల్.. ప్రియని నామినేట్ చేశారు. ఇక ఈ వారం లోబో, శ్రీరామ్‌, ప్రియ‌, యానీ, ర‌వి, కాజ‌ల్‌, జెస్సీ, సిరి, మానస్ నామినేట్ అయిన‌ట్లు తెలుస్తుంది. మరి ఈ నామినేషన్స్ నుంచి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలంటే వారం చివరి దాకా వెయిట్ చేయాల్సిందే.