BiggBoss : బిగ్‌బాస్ నాన్‌స్టాప్.. ఓటీటీలో 24/7.. వచ్చేస్తుంది..

ఇటీవల తెలుగు బిగ్‌బాస్ సీజన్ 5 అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీజన్ నుంచి ఓటీటీలో 24/7 లైవ్ టెలికాస్ట్ కూడా వస్తుంది అని తెలిపారు. ఈ బిగ్‌బాస్ రియాల్టీ షో డిస్ని ప్లస్ హాట్‌స్టార్.......

BiggBoss : బిగ్‌బాస్ నాన్‌స్టాప్.. ఓటీటీలో 24/7.. వచ్చేస్తుంది..

Biggboss

BiggBoss :  బిగ్‌బాస్ రియాల్టీ షో ఇప్పుడు అన్ని భాషల్లోనూ బాగా క్లిక్ అయింది. అన్ని భాషా ప్రేక్షకులు బిగ్‌బాస్ ని ఆదరిస్తున్నారు. తెలుగులో కూడా ఈ షో బాగా హిట్ అయింది. ఇప్పటికే అయిదు సీజన్లను పూర్తి చేసుకుంది తెలుగు బిగ్‌బాస్. సీజన్ పెరిగే కొద్దీ ప్రేక్షకులు కూడా పెరుగుతున్నారు. జనాల ఆదరణ కూడా పెరుగుతుంది. టీవిలో బిగ్‌బాస్ షో మంచి రేటింగ్ ని తీసుకొస్తుంది.

ఇటీవల తెలుగు బిగ్‌బాస్ సీజన్ 5 అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీజన్ నుంచి ఓటీటీలో 24/7 లైవ్ టెలికాస్ట్ కూడా వస్తుంది అని తెలిపారు. ఈ బిగ్‌బాస్ రియాల్టీ షో డిస్ని ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో రానుంది. తాజాగా ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ అనే పేరుతో త్వరలో 24/7 టెలికాస్ట్ అవ్వనుంది అంటూ డిస్నీప్లస్ హాట్‌స్టార్ నుంచి ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. త్వరలో ఇది ప్రారంభమవ్వనుంది అని తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ అవుతుంది.

Sumanth : ఇప్పుడు విడాకులు అనేవి కామన్.. విడాకులపై హీరో సుమంత్ వ్యాఖ్యలు..

ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తయిందని, త్వరలోనే బిగ్ బాస్ షూటింగ్ మొదలవ్వనుంది అని తెలుస్తుంది. ఈ సారి మరింత ఆసక్తిగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సారి కూడా నాగార్జుననే బిగ్‌బాస్ షోకి హోస్ట్ గా చేయనున్నారు. బిగ్‌బాస్ అభిమానులు తెలుగు బిగ్‌బాస్ సీజన్ 6 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.