BiggBoss Non Stop : ఆగిపోయిన బిగ్‌బాస్‌.. డిస్నీప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్ల కంప్లైంట్స్..

తాజాగా నిన్న రాత్రి నుంచి బిగ్‌బాస్‌ ఆగిపోయింది. సాంకేతిక సమస్యల కారణంగా లైవ్‌ స్ట్రీమింగ్‌ ఆగిపోయింది. దీంతో ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి కొంచెం టైం............

BiggBoss Non Stop : ఆగిపోయిన బిగ్‌బాస్‌.. డిస్నీప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్ల కంప్లైంట్స్..

Biggboss

BiggBoss Non Stop :  అన్ని భాషలతో పాటు తెలుగులో కూడా క్రేజ్ తెచ్చుకున్న బిగ్‌బాస్‌ ఈ సారి 24 గంటలంటూ డిస్నిప్లస్ హాట్‌స్టార్‌లో బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ పేరుతో ప్రారంభమైంది. ఈ ఓటీటీలో రోజంతా టెలికాస్ట్ అవుతూ శని, ఆది వారాలు స్పెషల్ ఎపిసోడ్లు కూడా టెలికాస్ట్ అవుతుంది. ప్రారంభమైన మొదటి వారంలోనే షో మంచి రసవత్తరంగా సాగుతుంది. ఈ సారి పాత కంటెస్టెంట్స్ కూడా కొంతమంది పాల్గొంటున్నారు. దీంతో మాజీ కంటెస్టెంట్లను వారియర్స్‌గా, కొత్త కంటెస్టెంట్లను చాలెంజర్స్‌గా పిలుస్తున్నారు. ఈ సారి గేమ్ వారియర్స్ వర్సెస్ చాలెంజర్స్ అన్నట్టు సాగుతుంది.

ఇక బిగ్‌బాస్‌ అభిమానులు, ఆ కంటెస్టెంట్స్ అభిమానులు రోజూ షోని మిస్ అవ్వకుండా చూస్తున్నారు. కొంతమంది అయితే దీనికోసమే డిస్నీప్లస్ హాట్‌స్టార్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నారు. దీంతో ఈ ఓటీటీకి కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. మొదటి వారంలోనే హౌజ్‌లో గొడవలు, టీంలు, నామినేషన్లతో సాగిపోతుంది బిగ్‌బాస్‌. అయితే ఇలా ఆసక్తిగా సాగుతున్న బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ అప్పుడప్పుడు లైవ్ స్ట్రీమింగ్ ఆగిపోతుంది. ప్రేక్షకులు, సబ్‌స్క్రైబర్ల నుంచి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి.

Yash : ‘కేజీఎఫ్ 2’ నుంచి క్రేజీ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

తాజాగా నిన్న రాత్రి నుంచి బిగ్‌బాస్‌ ఆగిపోయింది. సాంకేతిక సమస్యల కారణంగా లైవ్‌ స్ట్రీమింగ్‌ ఆగిపోయింది. దీంతో ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి కొంచెం టైం కావాలి, అందుకే నిన్న అర్ధరాత్రి నుంచి బిగ్‌బాస్‌ నాన్ స్టాప్ లైవ్ స్ట్రీమింగ్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిలిపివేసింది. లైవ్ స్ట్రీమింగ్ ఆపేసి ఆ స్థానంలో పాత ఎపిసోడ్స్ ని టెలికాస్ట్ చేస్తున్నారు. దీంతో బిగ్‌బాస్‌ అభిమానులు, ప్రేక్షకులు, సబ్‌స్క్రైబర్ల నుంచి కంప్లైంట్స్‌ వస్తున్నాయి. సాకేంతిక సమస్యల వల్ల షో ఆగిందని గురువారం అర్ధరాత్రి నుంచి మళ్లీ స్ట్రీమింగ్ ను ప్రారంభిస్తామని తెలిపింది. ఇది విన్న బిగ్‌బాస్‌ అభిమానులు నిరాశ చెందుతున్నారు.