BiggBoss 6 : బిగ్‌బాస్‌ డేట్ వచ్చేసింది.. ఆ రోజు నుంచే మొదలు.. ఈ సారి కంటెస్టెంట్స్ ఎవరో..?

తాజాగా బిగ్‌బాస్‌ షో నుంచి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ ఓ ప్రోమోని విడుదల చేశారు. ఈ సారి బిగ్‌బాస్‌ సీజన్‌ 6 కూడా నాగార్జుననే యాంకర్ గా చేయనున్నారు. అలాగే ఈ సారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులని కూడా ఈ షోలో............

BiggBoss 6 : బిగ్‌బాస్‌ డేట్ వచ్చేసింది.. ఆ రోజు నుంచే మొదలు.. ఈ సారి కంటెస్టెంట్స్ ఎవరో..?

Bigg Boss Telugu Season 6 Starts September 4th

BiggBoss 6 :  బిగ్‌బాస్‌ షో తెలుగులో కూడా బాగా పాపులర్ అయింది. ఈ షోతో చాలా మంది సెలబ్రిటీలుగా పాపులారిటీ తెచ్చుకోగా మరి కొంతమంది పోయిన ఫామ్ ని తెచ్చుకున్నారు. తెలుగులో కూడా ఈ షోకి చాలా మంది అభిమానులు ఉన్నారు. కొంతమంది కంటెస్టెంట్స్ ని ఒక హౌస్ లో ఉంచి వాళ్ళకి పలు రకాల టాస్క్ లు ఇచ్చి చివరి వరకు ఉన్నవారిని విన్నర్ గా ప్రకటిస్తారు. ఇందులో పాల్గొనేవాళ్ళకి ఫేమ్ తో పాటు డబ్బులు కూడా బాగానే వస్తాయి. గత మూడు సీజన్ల నుంచి నాగార్జుననే బిగ్‌బాస్‌ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సారి బిగ్‌బాస్‌ సీజన్‌ 6 కూడా నాగార్జుననే యాంకర్ గా చేయనున్నారు. అలాగే ఈ సారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులని కూడా ఈ షోలో తీసుకోనున్నారు. ఇటీవలే బిగ్‌బాస్‌ సీజన్ 6 లోగో రివీల్ చేయగా తాజాగా ఎప్పట్నించి స్టార్ట్ అవుతుందో అనౌన్స్ చేసేశారు నిర్వాహకులు.

తాజాగా బిగ్‌బాస్‌ షో నుంచి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ ఓ ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమోలో.. కొంతమంది క్రికెట్‌ ఆడుతున్నారు. ఇంతలో సడన్‌గా బౌలర్‌ బంతి పట్టుకుని నేరుగా ఇంట్లోకి దూరిపోతాడు. క్షణాల్లో అక్కడున్న వాళ్లంతా మాయమవుతారు ఒక్క బ్యాట్ పట్టుకున్నతను తప్ప. వెంటనే నాగ్‌ ప్రత్యక్షమై అట్టా ఎర్రి మొహమేసుకుని సూత్తావేంట్రా ఇక్కడ ఆట ఆగిందంటే అక్కడ అసలైన ఆట మొదలైనట్లే అని చెప్తాడు. అందరూ కలిసి బిగ్‌బాస్‌ ని చూస్తున్నట్టు చూపించాడు. ఈ షో సెప్టెంబర్ నాలుగో తేదీ నుంచి ప్రారంభం కానుంది అని ప్రకటించారు. డిస్నిప్లస్ హాట్ స్టార్ ఓటీటీతో పాటు స్టార్ మా టీవీలో కూడా టెలికాస్ట్ అవుతుందని సమాచారం.

Chiranjeevi Birthday Special : మెగాస్టార్ ఎన్నో సూపర్ హిట్స్ ఉండగా.. ఘరానా మొగుడు సినిమానే రీరిలీజ్ ఎందుకు..?

ఇక బిగ్‌బాస్‌ షో స్టార్టింగ్ డేట్ ని ప్రకటించడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సారి బిగ్‌బాస్‌ లో కంటెస్టెంట్స్ ఎవరు ఉండబోతారా అని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికి కొంతమంది సెలబ్రిటీలు ఉండనున్నట్టు పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో యాంకర్ మంజూష, హీరోయిన్ ఆశా సైనీ, హీరో లక్ష్, ట్రాన్సజెండర్ తన్మయి, న్యూస్ యాంకర్ పద్మిని, ఆర్టిస్ట్ సంజన చౌదరి, యూట్యూబ్ ఆర్టిస్ట్ కుషిత, యాక్టర్ భరత్, సీరియల్ ఆక్టర్ కౌశిక్, హీరో సుమంత్ అశ్విన్, హీరోయిన్ ప్రీతీ అస్రానితో పాటు మరికొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఈ సారి సీజన్ ఎంత రసవత్తరంగా ఉండబోతుందో చూడాలి.