గంగవ్వ క్రేజ్ మాములుగా లేదుగా.. సోషల్ మీడియాని గట్టిగానే షేక్ చేస్తుంది: హాట్ ఫేవరేట్‌గా మారిపోతుందా?

  • Published By: vamsi ,Published On : September 7, 2020 / 03:19 PM IST
గంగవ్వ క్రేజ్ మాములుగా లేదుగా.. సోషల్ మీడియాని గట్టిగానే షేక్ చేస్తుంది: హాట్ ఫేవరేట్‌గా మారిపోతుందా?

గంగవ్వ.. గంగవ్వ.. ఇప్పుడు నెట్టింట్లో ఎక్కడ చూసినా ఆ అవ్వే. తెలంగాణ యాసతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను తాకి.. అందరి చేత అవ్వ అని పిలిపించుకుంటూ అందరికీ అవ్వగా మారిన అవ్వ గంగవ్వ.. అయితే ఇప్పుడు ఈ అవ్వ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. చాలా సింపుల్‌గా ప్రతి సామాన్య కుటుంబంలోని అవ్వలాగా కనిపించి ఆకట్టుకునే ఈ బామ్మ తెలుగు బిగ్‌బాస్ నాల్గవ సీజన్‌లో ఆకట్టుకుంటుంది.



బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మంలో పాల్గొన్న 16మంది కంటెస్టెంట్స్‌లో గంగ‌వ్వ ఒక‌రు కాగా.. మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా ప్రేక్షకులకు గంగవ్వ దగ్గరైంది. గంగ‌వ్వ తెలంగాణ యాస‌లో మాట్లాడుతూ.. స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి స్టార్స్‌ని కూడా ఇంట‌ర్వ్యూలు చేసి ఎంట‌ర్‌టైన్ చేసింది. నేష‌న‌ల్ మీడియా దృష్టిని కూడా ఆక‌ర్షించిన గంగ‌వ్వ బిగ్‌బాస్‌లో ఎంటర్‌టైన్ చెయ్యడానికి సిద్దం అయ్యింది.
https://10tv.in/bigg-boss-telugu-4-contestant-monal-gajjar-from-banking-to-acting/




షుమారు 60 ఏళ్ళకు దగ్గర వ‌య‌స్సు ఉన్న కంటెస్టెంట్ గంగ‌వ్వ తొలిసారి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌గా, ఆమెకు నెటిజ‌న్స్ నుంచి గట్టి మద్దతే లభిస్తుంది. #Gangavva #BiggBossTelugu4 హ్యాష్ ట్యాగ్‌లు ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ రకంగా చూస్తుంటే గంగవ్వే ఈసారి హాట్ ఫేవరేట్ అయినా ఆశ్చర్యం లేదు. ఇక ఈరోజు నుంచి బిగ్‌బాస్ లోపల ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది ప్రసారం కానుంది.



పల్లెల్లో ఉండే అవ్వలకు ఐకానిక్ సింబల్ లాంటి గంగవ్వపై నెటిజన్లు సరదాగా మెమీస్ చేస్తున్నారు. బోల్డ్‌గా ఉంటూ.. హాట్‌గా హీట్ పుట్టించే క్యారెక్టర్లు ఎంట్రీ ఇచ్చే ఈ షోలో గంగవ్వ లాంటి ఓ మధ్యతరగతి అవ్వను ప్రతిబింబించే వ్యక్తి అంటే కాస్త ఆసక్తికరమే. అందుకే అనుకుంటా.. ఆమె మిగతా యంగ్ అండ్ ఎనర్జిటిక్, పాపులర్ సెలబ్రిటీలను మించి ప్రస్తుతం ట్రెండింగులో దూసుకుపోతుంది.



సోషల్ మీడియాలో రోజు ఉంటే చాలామందికి గంగవ్వ తెలుసు.. కానీ ఆమె కథాకమావిషు, అసలు ఎవరు ఈ అవ్వ అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. ఆమెది జగిత్యాల జిల్లా లంబాడపల్లి… ఊహ తెలియకముందే తండ్రి చనిపోయాడు… 13 ఏళ్లొచ్చాక తల్లి మరణించింది… దీంతో తమ్ముళ్ల బాధ్యతను తీసుకోగా.. తాగుడుకు బానిసైన భర్తతో రోజూ గొడవలు పడుతూ.. పగలు కూలీ పనులకు వెళ్లి రాత్రుళ్లు బీడీలు చుడుతూ పిల్లలను పెంచి పోషించింది. పదిహేనేళ్ల క్రితం గల్ఫ్‌కి వెళ్లిన భర్త నయాపైసా పంపలేదు.. చివరకు ఆయన అక్కడే చనిపోయాడని తర్వాత తెలిసొచ్చింది.


అప్పటినుంచి తన టాలెంటుతో తెలంగాణ యాసలో యూట్యూబ్ వీడియోల్లో నటించడం స్టార్ట్ చేసింది. 8 మంది మనమలు, మనమరాళ్లు ఉన్న గంగవ్వ ఆ వీడియోలతో ఓ స్టార్‌గా మారిపోయింది. చివరకు బిగ్‌బాస్ హౌస్‌లో చేరిపోయింది. ఇక ఇప్పుడు నెటిజన్లు ఆమెపై చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే గంగవ్వ గట్టిగానే అందరి గుండెల్లోకి చేరేట్టే ఉంది.

ఇందులో మళ్లీ ఓ సరదా విషయంలో నెట్టింట్లో ట్రోల్ అవుతుంది. బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున వయసు 61 అందులోకి పదహారో కంటెస్టెంటుగా అడుగుపెట్టిన గంగవ్వ వయస్సు 57 నాగార్జున కంటే చిన్నదే.. అయితే అందరూ గంగవ్వ అని పిలుచుకునే అవ్వను టాలీవుడ్ మన్మథుడు ఏమని పిలుస్తాడో అంటూ సరదాగా మెమీస్ చేస్తూ నవ్వించేస్తున్నారు.