Biggboss-4: స్వాతిపైన లాస్య కంప్లైంట్.. అఖిల్-మోనాల్ ను విడగొట్టాలని గంగవ్వ ప్లాన్

Biggboss-4: స్వాతిపైన లాస్య కంప్లైంట్.. అఖిల్-మోనాల్ ను విడగొట్టాలని గంగవ్వ ప్లాన్

Biggboss-4 హౌజ్ లో శనివారం నవ్వులే నవ్వులు.. కమెడియన్ అవినాష్ కొంచెం చేస్తే కింగ్ నాగర్జున కంటెస్టెంట్లను ఆటపట్టిస్తూ మరికొంత ఎంటర్‌టైన్మెంట్ జోడించారు. మోనాల్ గజ్జర్ ను టీజ్ చేస్తూ.. లవ్ అఫైర్ గురించి పదేపదే అడుగుతూ నవ్వులు పూయించారు. రెడ్ చిప్ పెట్టుకున్న మాస్క్ లు అనే గేమ్ ఆడించిన నాగ్.. ఒక్కో కంటెస్టెంట్ ను పిలిచి వాళ్లు హౌజ్ లో ఎందుకు ఉండకూడదో చెప్పమని అడిగారు.

గంగవ్వ హారిక పరువు పోయేంత పనిచేసింది. బ్రష్ చేసుకోకుండానే టీ, కాఫీలు తాగుతుందంటూ చెప్పేసరికి హారిక ఏడుపు మొహం పెట్టుకుంది. లాస్య.. అవినాష్ కు తనకు మధ్య గొడవలు పెట్టొద్దని ఎస్కేప్ అయింది. ఇంకెవరి గురించైనా చెప్పమంటే.. కొత్తగా వచ్చిన స్వాతి ఇంకా అందరితో కలవలేదని మిగిలిన వాళ్ల గురించి చెప్పకుండా బయటపడింది.

టైటిల్ అందకముందే లేడీ బిగ్ బాస్ గా ఫీల్ అవుతున్న దేవీ నాగవల్లి.. గంగవ్వ గురించి చెప్పమంటే తనకు నచ్చిన వాళ్లు చెడు చేసినా మంచిగానే కనిపిస్తుంది. వాళ్లకు సపోర్టింగ్ గానే మాట్లాడుతుందని చెప్పింది. అరియానా.. తాను వెళ్లిపోతే, త‌న బాధ్య‌త‌ను స్వీక‌రించాల్సిందిగా దేవి నాగ‌వ‌ల్లి ద‌గ్గ‌ర మాట తీసుకుంది.

కుమార్ సాయి త‌న‌కు పోటీయే కాద‌ని హారిక తెలిపింది. ఇంట్లో నార‌దుడు సోహైల్ అని మోనాల్‌ తెలిపింది. బిగ్‌బాస్ హౌస్‌లో మోనాల్ ఉత్త‌మ అబ‌ద్ధాల కోరు అని లాస్య ప్ర‌క‌టించింది. మ‌రోవైపు కిడ్నాప్ ప్లాన్ అభిజిత్‌దే అని లాస్య చెప్తుంటే కాదు తాను చెప్పానని గంగ‌వ్వ అడ్డు ప‌డింది. ఇక‌ ఎలిమినేట్ అయిన వారిని కుమార్ సాయి స్థానంలోకి తీసుకురావ‌చ్చ‌ని దేవి నాగ‌వ‌ల్లి పేర్కొంది.

సోహైల్ ఇంట్లో త‌న‌కు బాగా చిరాకు తెప్పించే వ్య‌క్తి అని అరియానా చెప్ప‌గా, త‌న‌కు కూడా చిరాకు తెప్పించే వ్య‌క్తి అరియానా అని సోహైల్ పేర్కొన్నాడు. కుమార్ సాయికి అస‌లు ఇంట్లో ఉండేందుకు అర్హ‌త లేద‌ని మెహ‌బూబ్ చెప్పుకొచ్చాడు. ఈ ఇంట్లో అత్యంత న‌కిలీ వ్య‌క్తి అభి అని కుమార్ సాయి అభిప్రాయ‌ప‌డ్డాడు. టాస్క్‌లో నోటికొచ్చిన‌ట్లు తిడుతున్నాడ‌ని బాధ‌ప‌డ్డాడు.

ఇంటి స‌భ్యులంద‌రూ రోబోల టీమ్‌లో మ‌హా నాయ‌కుడుగా గంగ‌వ్వ పేరు చెప్తే నాగ్ మాత్రం యుద్ధం చేశాడంటూ అభిజిత్ పేరు చెప్పారు. అవినాష్‌కు మ‌హా కంత్రి అవార్డు బ‌హుక‌రించారు. గంగ‌వ్వ‌కు మ‌హా న‌టి అవార్డు బ‌హుక‌రించారు. ఆమె ట్రాప్ చేసేందుకు ప్ర‌య‌త్నించిన క్లిప్పింగ్‌ను చూపించారు. అది చూసి మ‌నుషుల టీమ్ షాక్‌కు లోన‌య్యారు.

అఖిల్ చిన్న చిన్న విష‌యాల‌కే కోపానికొస్తాడ‌ని మోనాల్ చెప్పింది. కుళ్లు జోకులేస్తున్నాడ‌ని నోయ‌ల్ మాస్ట‌ర్‌పై ఫిర్యాదు చేశాడు. అభి క‌నిపించేంత అమాయ‌కుడు కాద‌ని దివి పేర్కొంది. ఇంట్లో ఏమైపోతుందా అని లాస్య ఊరికే కంగారు ప‌డిపోతుంద‌ని అవినాష్ చెప్పుకొచ్చాడు. అనంత‌రం మోనాల్ సేఫ్ అయిన‌ట్లు ప్ర‌క‌టించారు.