మైఖేల్ మళ్లీ వస్తున్నాడు.. విదేశాల్లో ‘బిగిల్’ రీ-రిలీజ్

జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో విజయ్ నటించిన ‘బిగిల్’ చిత్రం రీ-రిలీజ్ కానుంది..

  • Published By: sekhar ,Published On : June 19, 2020 / 06:41 AM IST
మైఖేల్ మళ్లీ వస్తున్నాడు.. విదేశాల్లో ‘బిగిల్’ రీ-రిలీజ్

జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో విజయ్ నటించిన ‘బిగిల్’ చిత్రం రీ-రిలీజ్ కానుంది..

‌కరోనా మ‌హ‌మ్మారి వ‌ల‌న గ‌త మూడు నెల‌లుగా థియేట‌ర్స్ మూత‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. వీటితో పాటు షూటింగులు కూడా ఆగిపోయాయి. థియేటర్స్ ఎప్పుడు తెర‌చుకుంటాయో తెలియ‌ని ప‌రిస్థితి నెలకొంది. అయితే విదేశాల‌లో మాత్రం సినిమా హాళ్లు ఓపెన్ చేసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఈ నేప‌థ్యంలో మ‌న సినిమాల‌ని కూడా విదేశాల‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్ ‘గుడ్ న్యూస్’ సినిమాను దుబాయ్‌లో రిలీజ్ చేశారు. ఇప్పుడు అదే బాటలో ఫ్రాన్స్, జర్మనీ దేశాలు కూడా థియేటర్లను ఓపెన్ చేయనున్నాను. తమిళ స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్ నటించిన ‘బిగిల్’ చిత్రంతో థియేటర్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. 

Bigil re-release

‘బిగిల్’ జూన్ 22న ఫ్రాన్స్‌లో, జూన్ 30న జర్మనీలో విడుదల కానుంది. దీనికి సంబంధించిన టైమింగ్స్.. స్క్రీన్స్ లిస్ట్ డిస్ట్రిబ్యూటర్లు విడుదల చేశారు. విజయ్, అట్లీ కాంబినేషన్లో రూపొందిన హ్యాట్రిక్ సినిమా ‘బిగిల్’. గతేడాది దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా   మహిళల ప్రాధాన్యత నేప‌థ్యంలో రూపొందింది. సందేశాత్మక చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో విజయ్ డ్యూయెల్ రోల్స్‌లో మెప్పించాడు. నయనతార కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతమందించారు.  

Read: అర్జున్, అను.. చెరోసగం.. హ్యాపీ బర్త్‌డే కాజల్..