Bimbisara: బుల్లితెరపై బింబిసారుడి దూకుడు.. న్యూ ఇయర్ గిఫ్ట్ అంటోన్న కళ్యాణ్ రామ్!

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన రీసెంట్ మూవీ ‘బింబిసార’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఫాంటసీ యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు మంచి ఫలితాన్ని అందించారు. ఇక కళ్యాణ్ రామ్ డ్యుయెల్ రోల్‌లో చేసిన పర్ఫార్మెన్స్ కూడా ప్రేక్షకులను అలరించింది. రెండు కాలాలకు సంబంధించిన కథనం కావడంతో ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్తగా అనిపించింది.

Bimbisara: బుల్లితెరపై బింబిసారుడి దూకుడు.. న్యూ ఇయర్ గిఫ్ట్ అంటోన్న కళ్యాణ్ రామ్!

Bimbisara All Set For TV Premiere On New Year Day

Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన రీసెంట్ మూవీ ‘బింబిసార’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఫాంటసీ యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు మంచి ఫలితాన్ని అందించారు. ఇక కళ్యాణ్ రామ్ డ్యుయెల్ రోల్‌లో చేసిన పర్ఫార్మెన్స్ కూడా ప్రేక్షకులను అలరించింది. రెండు కాలాలకు సంబంధించిన కథనం కావడంతో ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్తగా అనిపించింది.

Bimbisara: బింబిసారుడి ఆగమనం.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!

దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన తొలి సినిమానే అయినా, ఈ సినిమాను ఎంటర్‌టైనింగ్‌గా మలచడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. ఇక ఇప్పటికే ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ దక్కించుకుంటున్న ఈ సినిమా, త్వరలోనే బుల్లితెరపై ప్రసారం కాబోతుందట. బింబిసార చిత్రాన్ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రముఖ టీవీ ఛానల్ జీ తెలుగులో న్యూ ఇయర్ కానుకగా టెలికాస్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Bimbisara: పండగపూట షాకిచ్చిన బింబిసార.. ఇక వచ్చేది అప్పుడే!

ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బింబిసార పాత్రలో చెప్పిన డైలాగ్స్, ఆయన బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిరంతన్ భట్, కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమాకు మరో మేజర్ అసెట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో కేథరిన్ త్రేజా, సంయుక్తా మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. మరి బాక్సాఫీస్, ఓటీటీల్లో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్న ‘బింబిసార’ బుల్లితెరపై ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.