Bimbisara: టీఆర్పీ రేటింగ్స్‌లో అదరగొట్టిన బింబిసార!

నందమూరి కాళ్యాణ్ రామ్ నటించిన రీసెంట్ మూవీ ‘బింబిసార’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. పీరియాడిక్ ఫిక్షన్ కథగా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. రెండు కాలాలను కనెక్ట్ చేస్తూ, సినిమా కథను ముందుకు తీసుకెళ్లిన వైనం ఈ సినిమాకు మంచి బలాన్ని అందించింది. ఇక బింబిసార పాత్రలో కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది.

Bimbisara: టీఆర్పీ రేటింగ్స్‌లో అదరగొట్టిన బింబిసార!

Bimbisara Gets Good TRP On First Telecast

Bimbisara: నందమూరి కాళ్యాణ్ రామ్ నటించిన రీసెంట్ మూవీ ‘బింబిసార’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. పీరియాడిక్ ఫిక్షన్ కథగా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. రెండు కాలాలను కనెక్ట్ చేస్తూ, సినిమా కథను ముందుకు తీసుకెళ్లిన వైనం ఈ సినిమాకు మంచి బలాన్ని అందించింది. ఇక బింబిసార పాత్రలో కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది.

Bimbisara: బింబిసారుడి ఆగమనం.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!

ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా అదిరిపోయే ఫిగర్స్‌ను నమోదు చేసింది. అటు ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫాంలోనూ మంచి వ్యూయర్‌షిప్‌ను సాధించి బింబిసార మూవీని సూపర్ హిట్‌గా నిలిపింది. అయితే తాజాగా ఈ సినిమా మరో విజయాన్ని అందుకుంది. బింబిసార చిత్రాన్ని ఇటీవల తొలిసారి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ చేయగా, ఈ సినిమాను బుల్లితెరపై చూసేందుకు ప్రేక్షకులు మంచి ఆసక్తిని చూపారు.

Bimbisara: పండగపూట షాకిచ్చిన బింబిసార.. ఇక వచ్చేది అప్పుడే!

దీంతో ఈ సినిమాకు 11.5 టీఆర్పీ రేటింగ్ వచ్చినట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది. ఓ మీడియం బడ్జెట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు ఇది చాలా మంచి టీఆర్పీ రేటింగ్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ డ్యుయెల్ రోల్‌లో నటించగా, అందాల భామలు కేథరిన్ త్రేజా, సంయుక్తా మీనన్‌లు హీరోయిన్లుగా నటించగా.. ఎంఎం.కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ అఫీషియల్ బ్యానర్‌పై స్వయంగా ప్రొడ్యూస్ చేశాడు.