BiggBoss Nonstop : బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్.. బిందు మాధవి.. అందరూ అనుకున్నదే అయిందిగా..
బిందు మాధవి చెయ్యి ఎత్తి తనని బిగ్‌బాస్ నాన్ స్టాప్ విన్నర్ గా ప్రకటించారు నాగార్జున. మొదటిసారి ఒక ఫిమేల్ కంటెస్టెంట్ బిగ్‌బాస్ ట్రోఫీ గెలుచుకుంది తెలుగులో............................

BiggBoss Nonstop : తెలుగు బిగ్‌బాస్ అయిదు సీజన్లని పూర్తి చేసుకొని ఆరోసారి బిగ్‌బాస్ నాన్ స్టాప్ అంటూ ఓటీటీలో 24 గంటలు టెలికాస్ట్ అయింది. అయితే టీవీలో వచ్చినంత ఆదరణ ఓటీటీలో రాకపోవడంతో ఈ రియాల్టీ షోని తొందరగానే ముగించారు. ప్రతి వారం ఎవరో ఒకరిని గెస్ట్ గా తెచ్చి షోకి హైప్ తీసుకు వద్దామన్నా ట్రై చేసినా అది అంతగా ఫలించలేదు. అందుకే 100 రోజులు సాగాల్సిన షోని 83 రోజుల్లోనే క్లోజ్ చేసేశారు.
ఫిబ్రవరి 26న నాగార్జున హోస్టింగ్ తో గ్రాండ్ గా ప్రారంభమైన ఈ బిగ్ రియాల్టీ షోకి ముగింపు పడింది. 18 మందితో మొదలైన ఈ షో 83 రోజులు సాగి చివరకు 7 గురు కంటెస్టెంట్స్ మిగిలారు. మొదటిసారి బిగ్‌బాస్ లో 7 గురు కంటెస్టెంట్స్ ఫైనల్ కి వెళ్లడం. బాబా భాస్కర్, అనీల్ రాథోడ్, మిత్రా శర్మ, అరియానా గ్లోరి, యాంకర్ శివ, అఖిల్ సార్థక్, బిందు మాధవి ఫైనల్ కి వెళ్లారు. చివరి ఎపిసోడ్ కావడంతో పలువురు సెలబ్రిటీలు ఈ షోకి వచ్చారు. సత్యదేవ్, మేజర్ సినిమా టీం, F3 సినిమా టీం రాగా, హీరోయిన్స్ మెహరీన్, దక్ష నగర్కర్, అప్సర రాణి ఈ షోలో తమ డ్యాన్స్ లతో మెప్పించారు.
మిగిలిన 7 గురిలో వరుసగా ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేయగా అరియానా గ్లోరి 10 లక్షల రూపాయలు తీసుకొని వెళ్ళిపోయింది. ఇక చివరకు అఖిల్ సార్థక్, బిందు మాధవి మిగిలారు. వారితో మాట్లాడించి స్టేజి పైకి తీసుకొచ్చారు నాగార్జున. వారిద్దరిలో బిందు మాధవి చెయ్యి ఎత్తి తనని బిగ్‌బాస్ నాన్ స్టాప్ విన్నర్ గా ప్రకటించారు నాగార్జున. మొదటిసారి ఒక ఫిమేల్ కంటెస్టెంట్ బిగ్‌బాస్ ట్రోఫీ గెలుచుకుంది తెలుగులో. దీంతో బిందు మాధవి అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
Rajendra Prasad : ఈ సినిమా హిట్ అవ్వకపోతే.. ఇక నేను మీకు కనపడను..
అయితే ముందు నుంచి కూడా చాలా మంది బిందు మాధవినే గెలుస్తుంది అని చెప్పారు. ఇప్పటి వరకు అందరూ అబ్బాయిలే గెలవడం, ఆల్రెడీ పార్టిసిపేట్ చేసిన వాళ్లకి కప్ ఇచ్చే ఛాన్సులు తక్కువగా ఉండటం, చాలా మంది సెలబ్రిటీలు బిందు మాధవికి సపోర్ట్ చేయడం, కొత్త కంటెస్టెంట్స్ లో జనాలకి కాస్తో కూస్తో తెలిసింది బిందు మాధవి అవ్వడంతో ఈమెకే కప్ వస్తుందని మొదటి నుంచి అంతా భావించారు. అందరూ అనుకున్నట్టుగానే మొత్తానికి బిగ్‌బాస్ నాన్ స్టాప్ లో బిందు మాధవి విన్నర్ గా నిలవగా ఈ షో పూర్తయింది. త్వరలోనే బిగ్‌బాస్ 6వ సీజన్ టీవిలో మొదలవ్వనున్నట్టు సమాచారం.
దీంతో తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే మొదటిసారిగా ఒక మహిళ గెలిచింది. తెలుగు బిగ్‌బాస్ తొలి మహిళా విజేతగా బిందు మాధవి నిలిచింది. దీంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయింది బిందు. బిగ్‌బాస్ కప్ కొట్టాలన్న అఖిల్ ఆశలు మరోసారి అడియాశలే అయ్యాయి.
- Akkineni Heros : బిజీబిజీగా అక్కినేని హీరోలు.. గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు..
- BiggBoss 6 : బిగ్‌బాస్ 6లో మీరు కూడా పాల్గొనాలనుకుంటున్నారా??
- Bindu Madhavi : బిగ్‌బాస్ విన్నర్ బిందు మాధవి షో నుంచి ఎంత సంపాదించిందో తెలుసా??
- Bindu Madhavi : బాలయ్య సినిమాలో బిగ్‌బాస్ విన్నర్
- దోషులు ఎవరైనా చట్ట ప్రకారం శిక్షించి తీరుతాం
1VP Khalid : షూటింగ్ సెట్ లో మరణించిన సీనియర్ నటుడు..
2Dating App: డేటింగ్ యాప్‌లో యువతి పరిచయం.. బ్యాంక్ మేనేజర్ నుంచి రూ.5.81 కోట్లు స్వాహా
3Rocketry : ఈ సినిమా కోసం ఆ స్టార్ హీరోలిద్దరూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు..
4Ranbir Kapoor : రణబీర్ కారుకి యాక్సిడెంట్.. ఇవాళ నా అదృష్టం.. లేకపోతే..
5Kartihkeya 2 : ఈ సారి కృష్ణుడి కోసం.. ద్వారకా నగరం ఏమైంది??.. అదరగొట్టిన కార్తికేయ 2 ట్రైలర్..
6Subba Rao Arrest : ఎంత పని చేశావ్ సుబ్బారావ్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావ్..?
7TRS Bhavan : ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ నిర్మాణం పనులు వేగవంతం
8Telangana Covid Terror News : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు
9Apple School Offers : ఆపిల్ బ్యాక్ టూ స్కూల్ కొత్త ఆఫర్లు.. భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!
10Rahul Gandhi : కేరళలోని రాహుల్ గాంధీ ఆఫీసుపై ఎస్ఎఫ్ఐ కార్యకర్తల దాడి
-
Apple iPhones : భారతీయుల ఐఫోన్లు 80శాతం ఛార్జింగ్‌తోనే ఆగిపోతున్నాయి.. అసలు కారణం ఇదే!
-
Netflix Employees : నెట్‌ఫ్లిక్స్‌కు ఏమైంది.. మరో 300 మంది ఉద్యోగుల తొలగింపు.. అసలు కారణాలివే..!
-
AC Costlier : జూలై 1 నుంచి పెరగనున్న ఏసీల ధరలు.. ఎందుకో తెలుసా..!
-
Xiaomi 12 Ultra : షావోమీ 12 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్ డేట్ లీక్.. ఎప్పుడంటే?
-
Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో వయస్సు వెరిఫికేషన్‌కు మూడు ఆప్షన్లు.. సెల్ఫీ వీడియో పంపాల్సిందే!
-
Corona Cases : దేశంలో కొత్తగా 17,336 కరోనా కేసులు, 13 మరణాలు
-
Tati Venkateshwarlu : టీఆర్ఎస్ కి భారీ షాక్..కాంగ్రెస్ లో చేరనున్న తాటి వెంకటేశ్వర్లు
-
Sonia ED Summons : సోనియాకు ఈడీ మరోసారి నోటీసులు..విచారణకు హాజరవుతారా?