హ్యాపీ బర్త్‌డే సునీల్ – ‘కలర్ ఫోటో’లో విలన్‌.. ‘ఎస్ 5’లో సులేమాన్ ఖాన్‌..

పాపులర్ కమెడియన్, హీరో సునీల్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త సినిమా అప్ డేట్స్..

  • Published By: sekhar ,Published On : February 28, 2020 / 10:18 AM IST
హ్యాపీ బర్త్‌డే సునీల్ – ‘కలర్ ఫోటో’లో విలన్‌.. ‘ఎస్ 5’లో సులేమాన్ ఖాన్‌..

పాపులర్ కమెడియన్, హీరో సునీల్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త సినిమా అప్ డేట్స్..

సునీల్ క‌మెడియ‌న్‌గా, హీరోగా ప‌లు చిత్రాల్లో న‌టించి మెప్పించాడు. తెలుగు సినిమా పుస్త‌కంలో సునీల్‌‌కి ఓ ఛాప్ట‌ర్ వుంది. క‌మెడియన్‌గా ఎవ్వ‌రికీ ఏ హ‌నీ చేయలేదు.. హీరోగా ఎవ‌రినీ ఎప్పుడూ క‌ష్ట‌పెట్ట‌లేదు. త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో కూడా త‌న‌కున్న‌దాన్ని వేరే వారికి స‌హాయం చేశాడే త‌ప్ప కించింత కూడా ఇబ్బంది పెట్ట‌లేదు.. కానీ ఓ ద‌ర్శ‌కుడు మాత్రం నా క‌ల‌ర్‌ఫోటోకి సునీల్ విల‌న్ అంటున్నాడు. అస‌లు క‌ల‌ర్‌ఫోటో ఏంటి.. సునీల్ విల‌న్ ఏంటి.. 

వివరాళ్లోకి వ‌స్తే.. ‘హృదయ కాలేయం’, ‘కొబ్బరిమట్ట’ లాంటి స్పూఫ్ కామెడీల‌తో బ్లాక్ బాస్టర్స్ కొట్టి మైండ్‌బ్లాక్ చేసిన‌ అమృత ప్రొడక్షన్స్ తదుపరి చిత్రం ‘కలర్‌ఫోటో’ని లౌఖ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తోంది. సంయుక్తంగా నిర్మిస్తున్న విష‌యం ప్రారంభం రోజునే చెప్పాం.. ‘మ‌జిలీ’, ‘ఏజెంజ్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ‌’, ‘ప్ర‌తిరోజూ పండ‌గే’ చిత్రాల్లో క‌మెడియన్‌గా క్రేజ్‌ని సొంతం చేస‌కున్న‌ సుహాస్ హీరోగా చేస్తున్నాడు.. ఇత‌నికి జోడిగా తెలుగమ్మాయి చాందిని చౌదరి నటిస్తుంది.

యూట్యూబ్‌లో వీడియోస్ ద్వారా పాపులర్ అయిన సందీప్ రాజ్ (మసాలా సందీప్) మెట్ట‌మెద‌టిసారిగా దర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి.. సునీల్ మీ ‘క‌ల‌ర్ ఫోటో’కి విల‌న్ ఏంటి అంటే మాత్రం అదంతా థియేట‌ర్స్‌లో చూడండి ఆయ‌న చేసిన ప‌నేంటో సిల్వ‌ర్ స్క్రీన్ మీద చూడాల్సిందే అంటూ ఇటీవ‌లే ‘మత్తు వదలరా’ సినిమాతో సక్సెస్ అందుకున్న కీరవాణి అబ్బాయి కాల భైరవ అందించిన స్వ‌రాల‌తో ఆన్స‌ర్ చెప్ప‌కుండా వెళ్ళిపోయాడు.

వీళ్ళంద‌ర్నీ పెట్టుకుని 1995 సంవ‌త్స‌రంలో ఒక ఇంజ‌నీరింగ్ కాలేజీలో జ‌రిగిన ప్రేమ‌క‌థని సీరియ‌స్‌గా తీయ‌టానికి సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని న‌డుం బిగించారు.. వీరికి శ్ర‌వ‌ణ్ కొంక ఆశీర్వాదాలు అందించాడు. వీళ్ళ తోక‌లు క‌త్తిరించే ప‌నిని మాత్రం కోదాటి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి అప్ప‌జెప్పారు. వీళ్ళ మ‌ధ్య గొడ‌వ‌ల‌కి కార‌ణ ఎ.విజ‌య్ అయితే వాటిని కూడా అందంగా చూపించే ప్ర‌యాత్నాన్ని చేస్తున్నారు వెంక‌ట్ ఆర్ శాఖ‌మూరి.. ‘క‌ల‌ర్ ఫోటో’ని అందంగా డెక‌రేట్ చేయ్య‌టానికి క్రాంతి ప్రియం బాధ్యత‌లు తీసుకున్నారు. 

గ‌మ‌నిక‌ : ఈ రోజు వెర్స‌టైల్ ఆర్టిస్ట్ సునీల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘క‌ల‌ర్‌ఫోటో’ లుక్ విడుద‌ల చేశారు.. సునీల్ స్పందిస్తూ : ‘‘క‌ల‌ర్ ఫోటో సినిమాలో రామ‌రాజుగా క‌నిపిస్తున్నాను.. నా కెరీర్‌లో బెస్ట్ క్యారెక్టర్ చేస్తున్నాను. అలాగే నా పాత్ర‌లో వున్న కొత్త‌దన‌మే అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది. ఇకముందు ఇలాంటి పాత్ర‌ల‌తో నా ఫ్యాన్స్‌ని అల‌రిస్తాను’’ అని అన్నారు.అలాగే నందమూరి తారకరత్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఎస్ 5’ సినిమా టీమ్ సునీల్‌కి బర్త్‌డే విషెస్ తెలుపుతూ వీడియో విడుదల చేశారు. ఈ సినిమాలో సునీల్ సులేమాన్ ఖాన్ పాత్రలో కనిపించనున్నాడు.