RRR: రాజమౌళికి బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్..

  • Published By: sekhar ,Published On : November 1, 2020 / 04:23 PM IST
RRR: రాజమౌళికి బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్..

Bandi Sanjay-SS Rajamouli: దర్శకధీరుడు రాజమౌళికి ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపు రావు వార్నింగ్ ఇచ్చిన సంఘటన మర్చిపోక ముందే మరో ఎంపీ, బీజేపీ తెలంగాణ అధ్యక్ష్యుడు బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఈ నెల 22న కొమురం భీమ్ 119వ జయంతి సందర్భంగా ఆర్ఆర్ఆర్ లో భీం క్యారెక్టర్ టీజర్ విడుదల చేశారు. టీజర్ చివర్లో భీమ్ టకియాను ధరించి కనబడడం వివాదాస్పదంగా మారింది. వెంటనే ఆ సీన్ తొలగించాలని పలు ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మనోభావాలను దెబ్బ తీయొద్దని హెచ్చరిస్తున్నాయి.

https://10tv.in/bjp-mp-warning-to-ss-rajamouli-and-jr-ntr-over-rrr-bheem-intro-teaser/



తాజాగా బండి సంజయ్ కూడా రాజమౌళికి వార్నింగ్ ఇస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొమురం భీం కు టోపి పెడితే ఒప్పుకోమని, కొమురం భీం ను కించపరిచే విధంగా, ఆదివాసీల హక్కులను, మనోభావాలను కించపరిచేలా సినిమా తీశావ్.. సినిమా రిలీజ్ చేస్తే థియేటర్లు కాల్చేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు బండి సంజయ్.


RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలో భీం పాత్ర ధరించిన టకియాను(ముస్లింలు ధరించే టోపి) తొలగించాలని.. నైజాంకు వ్యతిరేకంగా కొమురం భీం పోరాటం చేసి అమరుడయ్యారని, భీం ను చంపిన వాళ్ళ టోపీ ఆయనకు పెట్టడం ఆదివాసులను అవమానించడమేనన్నారు. రాజమౌళి ఇప్పటికైనా చరిత్రను తెలుసుకోవాలని, లేకుంటే మర్యాద ఉండదంటూ సోయం బాపు రావు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.