Balakrishna : మాస్ డైరెక్టర్‌తో మరో సినిమా ఓకే చేసిన బాలయ్య

బ్యాక్ టు బ్యాక్ సినిమాలని ఓకే చేస్తున్నాడు బాలయ్య. తాజాగా మరో సినిమాని కూడా ఓకే చేసినట్టు సమాచారం. రచ్చ, గౌతమ్ నంద, సీటిమార్ లాంటి మాస్ సినిమాలు తీసిన సంపత్‌నంది దర్శకత్వంలో......

Balakrishna : మాస్ డైరెక్టర్‌తో మరో సినిమా ఓకే చేసిన బాలయ్య

Balakrishna

Balakrishna :   బాలకృష్ణ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు. ఒక పక్క ‘అఖండ’ భారీ విజయం సాధించింది. కలెక్షన్స్ కూడా 100 కోట్లు దాటాయి. మరో వైపు యాంకర్ గా ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షోలో అదరగొడుతున్నారు. బాలయ్య నెక్స్ట్ సినిమా గోపీచంద్ మలినేనితో అని ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా పూర్తయింది. ఈ నెలలోనే షూటింగ్ మొదలవ్వబోతుంది.

ఆ తర్వాత అనిల్ రావిపూడితో సినిమా ఉండబోతుంది అని కూడా ఇటీవలే అనౌన్స్ చేశారు. ఆహా షోలో వచ్చినప్పుడు అనిల్ రావిపూడి కూడా ఈ సినిమా గురించి మాట్లాడాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలని ఓకే చేస్తున్నాడు బాలయ్య. తాజాగా మరో సినిమాని కూడా ఓకే చేసినట్టు సమాచారం. రచ్చ, గౌతమ్ నంద, సీటిమార్ లాంటి మాస్ సినిమాలు తీసిన సంపత్‌నంది దర్శకత్వంలో బాలకృష్ణ సినిమాను ఓకే చేసినట్టు సమాచారం.

SonuSood : సోదరితో కలిసి 1000 మందికి సైకిల్స్ పంపిణి చేసిన రియల్ హీరో సోనూసూద్

మాస్ సినిమాలు చేసే సంపత్ నంది బాలకృష్ణ మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని యాక్షన్‌, మాస్‌ అంశాలతో ఓ కథను బాలయ్యకి వినిపించినట్లు, ఆయన ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన ఇస్తారని సమాచారం. మాస్ సినిమాలు బాలయ్య బాబుకి బాగా కలిసొస్తాయి. మళ్ళీ మాస్ డైరెక్టర్ తో సినిమా అంటే ఈ సినిమాపై అప్పుడే అంచనాలు నెలకొన్నాయి.