Bheemla Nayak : డైనమిక్ డానియెల్ శేఖర్ వచ్చేస్తున్నాడు..

‘భీమ్లా నాయక్’ సినిమాలో రానా దగ్గుబాటి చేస్తున్న డానియెల్ శేఖర్ క్యారెక్టర్‌కి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు టీం..

Bheemla Nayak : డైనమిక్ డానియెల్ శేఖర్ వచ్చేస్తున్నాడు..

Daniel Shekar

Bheemla Nayak: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీని.. ‘భీమ్లా నాయక్’ పేరుతో.. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ రీమేక్ చేస్తున్నారు.

Pawan Kalyan : క్లీన్ స్మాష్.. ‘భీమ్లా నాయక్’ ఆల్ టైమ్ టాప్ 1 రికార్డ్..

సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తుండగా.. స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే – డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పవన్ గ్లింప్స్, టైటిల్ సాంగ్‌కి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. శుక్రవారం రానా దగ్గుబాటి క్యారెక్టర్ గురించి అప్‌డేట్ ఇచ్చింది టీం.

Bheemla Nayak : ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్‌ పాడింది ఎవరో తెలుసా..?

ఈ సినిమాలో రానా.. డానియెల్ శేఖర్ రోల్ చేస్తున్నారు. సెప్టెంబర్ 20వ తేది Blitz of Daniel Shekar పేరుతో వీడియో విడుదల చెయ్యబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వదిలిన రానా పోస్టర్ ఆకట్టుకుంటుంది. నిత్యా మీనన్, ఐశ్యర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ మూవీ 2022 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.