Bollywood Actress : బికినిలో అదర గొడుతున్న భామలు..

కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి.. మళ్లీ ‘ఛలో మాల్దీవ్స్’ అంటున్నారు బాలీవుడ్ స్టార్స్..

10TV Telugu News

Bollywood Actress: కోవిడ్ ఫస్ట్‌వేవ్ తర్వాత మాల్దీవుల్లో అందాల విందిచ్చిన బాలీవుడ్ స్టార్స్.. మళ్లీ అదే స్పాట్‌లో హడావిడి చేస్తున్నారు. వీలు దొరికితే ‘ఛలో మాల్దీవ్స్’ అంటూ ఎగిరి పోతున్నారు. సింగిల్ అయినా.. మింగిల్ యినా.. ఫ్యామిలీ అయినా.. లవ్ ఫెయిల్యూర్ అయినా.. ఇప్పుడు స్టార్స్ ట్రెండీ డెస్టినేషన్.. మాల్దీవులే.

Disha Patani : బీచ్‌లో బికినీలో సూర్యకాంతిలో మెరిసిపోతున్న ముద్దుగుమ్మ..

కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి.. మళ్లీ ‘ఛలో మాల్దీవ్స్’ అంటున్నారు బాలీవుడ్ స్టార్స్. వాళ్లకిష్టం వచ్చినట్టు అక్కడ హడావిడి చేసేస్తూ.. సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారుతున్నారు. రీసెంట్‌గా వైబ్రంట్ బికినీస్‌తో మాల్టీవ్స్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది సారా అలీఖాన్. ‘సన్ కిస్సెడ్, సన్ సెట్ లవర్’ అంటూ రకరకాల ఫోజులతో అట్రాక్ట్ చేస్తోంది సారా అలీఖాన్.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

కూతురు బికినీ అందాల విందు అలా ఉంటే ఈమధ్యే సారా తండ్రి సైఫ్ అలీఖాన్ సైతం మాల్దీవుల్లో చిల్ అయ్యాడు. భార్య కరీనా కపూర్ కొడుకులు తైమూర్, జెహ్ లతో కలిసి సముద్ర తీరాల్లో ఎంజాయ్ చేసాడు సైఫ్. ఆయన బర్త్‌డే సందర్భంగా.. అదీ కరీనా స్పెషల్ రిక్వెస్ట్ కారణంగా సైఫ్ ఫ్యామిలీతో కలిసి ఫుల్ హ్యాంగోవర్ అయ్యారు మాల్దీవుల్లో. ఇక తగ్గేదేలే అంటూ ఫోటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేసింది కరీనా కపూర్.

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

అజయ్ దేవగణ్, కాజోల్ కొడుకు యుగ్ రీసెంట్‌గా 11వ బర్త్ డే జరుపుకున్నాడు. అదీ మాల్దీవుల్లో. ఈ స్వీట్ అకేషన్‌ని అజయే దగ్గరుండి జరిపించాడు. కానీ వీళ్ల టూర్‌లో కాజోల్ మిస్సయింది. ఆగస్ట్ 14న పెళ్లి చేసుకున్న బాలీవుడ్ ప్రొడ్యుసర్స్ కరణ్ బులానీ, రియా కపూర్ వాళ్ల హనీమూన్ డేస్‌ను మాల్దీవుల్లో ఫిక్స్ చేసుకున్నారు. రొమాంటిక్ ఫోజులిస్తూ వరుసగా ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఐలాండ్ నేషన్‌లో వీళ్లిద్దరి రొమాన్స్ ఇప్పుడు సోషల్ మీడియా యాప్స్‌లో వైరల్‌గా మారింది.

Tamannaah : నిర్మాతలకు సారీ చెప్పిన తమన్నా..

ఫ్రీ టైం దొరికితే చాలు.. చటుక్కున మాల్దీవుల్లో వాలిపోతున్నారు మన స్టార్స్. టీవీ ఆర్టిస్ట్స్ దగ్గరి నుంచి పాన్ ఇండియా తోపుల వరకు.. అందరికీ ఇప్పుడు మాల్దీవులే కావాలి. మరిక్కడికి వెళ్లాక ఊరికినే ఉంటారా.. హాట్ హాట్ ఫోజులిస్తూ జనాల మతి పొగడుతున్నారు.

ఈమధ్యే మాల్దీవుల్లో టైం స్పెండ్ చేసింది జాన్వీ కపూర్. అందాల తీరాల్లో స్టన్నింగ్ ఫోజులిచ్చింది. అసలే గ్లామర్ విందు వడ్డించటంలో ఏమాత్రం మొహమాటపడని జాన్వీ.. ఫ్రెండ్స్‌తో కలిసి అక్కడ రెచ్చిపోయింది. ఇటు మొన్నటివరకు బిజీ షెడ్యూల్స్‌తో గడిపిన అలియా భట్ కూడా మాల్దీవుల్లో హీట్ పుట్టించింది. పర్ఫెక్ట్ వెకేషన్ అంటూ బికినీల్లో ఫోటోలు షేర్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

ఫ్యామిలీతో మాల్దీవుల టూర్ వేసిన సన్నీ లియోన్.. గ్లామర్ పిక్స్‌తో మతిపోగొట్టింది. స్వర్గానికి దారంటూ షాంపైన్ బాటిల్‌తో హల్ చల్ చేసింది. స్పా సెషన్స్‌‌తో స్ట్రెస్ మొత్తం పోగొట్టుకుంది. హాట్ బికినీ ఫోటోలతో ఫ్యాన్స్‌కి షాకిచ్చింది మౌనీ రాయ్. కోవిడ్ 19 రిస్ట్రిక్షన్స్, హెక్టిక్ షెడ్యూల్‌తో అలిసిపోయానని.. మాల్దీవుల్లో మస్త్ ఎంజాయ్ చేస్తున్నానని చెప్పి కూల్ పిక్స్ షేక్ చేసింది మౌనీ రాయ్.

 

View this post on Instagram

 

A post shared by Hansika Motwani (@ihansika)

టెలివిజన్ యాక్టర్స్ మేమేం తక్కువ కాదంటూ మాల్దీవుల్లో సందడి చేస్తున్నారు. తన వైఫ్‌తో రోహిత్ రాయ్ ఎంజాయ్ మోడ్‌లో ఉంటే ఇతని ఫ్రెండ్ హీనా ఖాన్ బాయ్ ఫ్రెండ్ రాఖీ జైస్వాల్‌తో కలిసి మాల్దీవుల్లో విహరించింది. ‘పాండ్యా స్టోర్’ ఫేం షైనీ దోషీ బోల్డ్ అవతారమెత్తింది. భర్తతో కలిసి హనీమూన్ స్టంట్స్ చేసింది. ‘దిల్ బెచారా’ హీరోయిన్ సంజనా సంఘీ మాల్దీవుల్లోని హ్యాపీ మూమెంట్స్‌ను ఫ్యాన్స్‌తో పంచుకుంది. హన్సిక, ఆండ్రియా, సురభి చంద్రా, సనా ఖాన్, తనీషా ముఖర్జీ.. ఒకరా ఇద్దరా.. గ్యాప్ దొరికితే మాల్దీవుల్లో చుక్కలు చూపిస్తున్నారు హీరోయిన్స్.