Priyanka Chopra : కోవిడ్ బూస్ట‌ర్ వ్యాక్సిన్ వేయించుకున్న ప్రియాంకా చోప్రా

బాలీవుడ్ న‌టి ప్రియాంకా చోప్రా కోవిడ్ బూస్ట‌ర్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. లండ‌న్‌, స్పెయిన్‌లో షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రియాంకా..ఇటీవ‌లే లాస్ ఏంజిల్స్ చేరుకున్నారు.

Priyanka Chopra : కోవిడ్ బూస్ట‌ర్ వ్యాక్సిన్ వేయించుకున్న ప్రియాంకా చోప్రా

Priyanka

Priyanka Chopra vaccinated Covid Booster : బాలీవుడ్ న‌టి ప్రియాంకా చోప్రా కోవిడ్ బూస్ట‌ర్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. లండ‌న్‌, స్పెయిన్‌లో షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రియాంకా..ఇటీవ‌లే లాస్ ఏంజిల్స్ చేరుకున్నారు. అక్క‌డ కోవిడ్ బూస్ట‌ర్ వ్యాక్సిన్ తీసుకున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు.

కారులో కూర్చుని బూస్ట‌ర్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ ఫొటోను ఆమె పోస్టు చేసింది. అంద‌రూ వ్యాక్సిన్ వేయించుకోవాలని త‌న అభిమానుల్ని కోరారు. ప్ర‌స్తుతం సిటాడెల్ సిరీస్ షూటింగ్‌లో ప్రియాంకా చోప్రా పాల్గొంటోంది.

Bride Died : పెళ్లింట విషాదం..రోడ్డు ప్రమాదంలో వధువు మృతి

ఇండియా, ఇట‌లీ, మెక్సికోల్లో సిరీస్ షూట్ చేయ‌నున్నారు. రూసో బ్ర‌ద‌ర్స్ దీన్ని డైర‌క్ట్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఆ సిరీస్‌ను రూపొందిస్తోన్న విషయం తెలిసిందే.